Sai Dharam Tej Marriage: ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. అందులో చాలామంది హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఆ హీరోల్లో ఒకడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్. ఈ హీరో పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ఎప్పటికప్పుడు అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ వచ్చేసింది. తాజాగా మరోసారి సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఇదే నిజమయితే తమకు డబుల్ హ్యాపీనెస్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.


అప్పుడలా.. ఇప్పుడిలా..


సాయి ధరమ్ తేజ్‌కు ఎప్పటికీ ఇలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉండిపోవడం ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా తానే ఎన్నోసార్లు బయటపెట్టాడు. పెళ్లిపై తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు ఈ మెగా హీరో. అయినా కూడా ఎప్పటికప్పుడు తన పెళ్లి గురించి రూమర్స్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి అసలు సంబంధం లేని అమ్మాయిను సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోనున్నాడని అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ నిజం కాదని ఈ హీరో క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు మరోసారి ఒక బిజినెస్‌మ్యాన్ కూతురితో తనకు పెళ్లి జరగనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.


మెగా ఫ్యామిలీ హ్యాపీ..


ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా ఒక రేంజ్‌లో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ కుటుంబం.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా మొదటి సక్సెస్‌ను చవిచూసింది. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే సందర్భంలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త వారిని మరింత సంతోషపెడుతోంది. తాను సింగిల్ అని, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేనని ఎన్నోసార్లు చెప్పాడు ఈ యంగ్ హీరో. దీన్నిబట్టి చూస్తే తను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇంతలోనే బిజినెస్ మ్యాన్ కుమార్తెతో తన పెళ్లి వార్త విని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ వార్తలపై ఇంకా మెగా హీరో స్పందించలేదు.


సినిమాల్లో గ్యాప్..


తన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అవుతున్నా కూడా సాయి ధరమ్ తేజ్.. అప్పుడప్పుడు సినిమాల విషయంలో గ్యాప్ ఇస్తూ ఉంటాడు. కానీ గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ లాంటి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండూ సూపర్ హిట్స్‌ను సాధించాయి. ఆ తర్వాత సంపత్ నంది డైరెక్షన్‌లో ‘గాంజా శంకర్’ మూవీ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే ఒక గ్లింప్స్ కూడా విడుదలయ్యింది. కానీ ఆ తర్వాత ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయంపై కూడా సాయి ధరమ్ తేజ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో తన పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: అల్లు అర్జున్‌కు మరో షాక్ - ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా లేనట్టేనా?