Allu Arjun: స్టార్ హీరోలు మాట్లాడే ప్రతీ మాట, చేసే ప్రతీ పనిపై ప్రేక్షకులు చాలా ఫోకస్ పెడతారు. అందుకే కొన్ని సందర్భాల్లో కావాలని చేయకపోయినా.. స్టార్లు చేసే కొన్ని పనులు కాంట్రవర్సీలకు దారితీస్తాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పరిస్థితి అలాగే ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కన పెడితే.. కొన్నిరోజులుగా అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్, తన ఫ్యామిలీలో విభేదాల గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీ ఎన్నికల ప్రచారం మొదలయినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా అల్లు అర్జున్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోందని సమాచారం.


మరో దెబ్బ..


అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప 2’. రెండున్నర సంవత్సరాల క్రితం విడుదలయిన ‘పుష్ప’కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ లభించింది. దీంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ సినిమా ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు మూవీ పోస్ట్‌పోన్ కూడా అయ్యింది. ఫైనల్‌గా ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ రావడం పక్కా అని మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా కౌంట్‌డౌన్ కూడా మొదలుపెట్టారు. కానీ ఈసారి కూడా సినిమా పోస్ట్‌పోన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్.. ఈ టెన్షన్‌లో ఉండగానే తన కెరీర్‌పై మరో దెబ్బపడిందని తెలుస్తోంది.


తమిళ దర్శకుడితో..


‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో మూవీ దాదాపుగా ఫైనల్ అయిపోయింది. తమిళంలో దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న అట్లీ.. గతేడాది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ను తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో అట్లీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. త్వరగా ‘పుష్ప 2’ విడుదలయితే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బందులు రావడం వల్ల అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


షాకింగ్ రెమ్యునరేషన్..


‘జవాన్’తో బాలీవుడ్ రేంజ్ పాపులారిటీ అందుకున్న అట్లీ.. తన తరువాతి సినిమాల కోసం రూ.80 కోట్లు నుంచి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. తనకు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేకపోవడంతో అల్లు అర్జున్‌తో సినిమా వర్కవుట్ అయ్యే అవకాశం లేదని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కోలీవుడ్‌లో అట్లీకి ఉన్నంత పాపులారిటీ టాలీవుడ్‌లో లేదు. పైగా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అందుకున్నా కూడా ‘జవాన్’ను సౌత్ ప్రేక్షకులు చాలానే ట్రోల్ చేశారు. కాబట్టి తనతో ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వకపోవడం అల్లు అర్జున్‌కు పెద్ద నష్టమేమి కాదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఇంకా ఈ హీరోతో సినిమాలు చేయడానికి లైన్‌లో ఉన్నారు.



Also Read: పవన్‌ కళ్యాణ్‌కు సాయి దుర్గా తేజ్ స్పెషల్ గిఫ్ట్ - నెటిజన్ల ఫన్నీ కామెంట్స్