Bollywood Movie On 2019 Hyderabad Gang Rape And Murder - Disha Case: ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అయితే... 2019లో జరిగిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఓ హత్యాచార ఘటన దేశమంతా ఉలిక్కి పడేలా చేసింది. సంచనలం సృష్టించింది. ఓ అమ్మాయి మీద నలుగురు యువకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడంతో పాటు ఆమె ప్రాణాలు తీశారు. బాధితురాలి అసలు పేరును పోలీసులు వెల్లడించలేదు. ఆమెకు దిశ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు మీద హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కరీనా కపూర్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన తారలుగా...
ప్రముఖ రచయిత, సాహితీవేత్త గుల్జార్ తనయురాలు మేఘనా గుల్జార్ దిశ కేసును వెండితెర మీదకు తీసుకు రానున్నారు. 'తల్వార్', 'రాజీ', 'చపాక్', 'సామ్ బహదూర్' - విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సినిమాలు తెరకెక్కించారు మేఘన. ఇప్పుడు దిశ కేసు మీద వర్క్ చేస్తున్నారని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ రేప్ కేసు... దిశ మీద మేఘనా గుల్జార్ తెరకెక్కించనున్న సినిమాలో కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) ప్రధాన పాత్రలు పోషించనున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆ తారలు ఇద్దరితో చర్చలు జరుపుతున్నారు. ఆల్రెడీ కరీనా, ఆయుష్మాన్ స్క్రిప్ట్ చదివారని, సినిమాలో యాక్ట్ చేయడానికి 'ఎస్' చెప్పారని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు కరీనా, ఆయుష్మాన్ కలిసి సినిమా చేయలేదు. ఇది వాళ్ళిద్దరికీ తొలి సినిమా కానుంది.
షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు?
కరీనా కపూర్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా సినిమాలో నటించడానికి ప్రాథమికంగా అంగీకరించడంతో త్వరలో అగ్రిమెంట్స్ వర్క్ కంప్లీట్ చేయాలని మేఘనా గుల్జార్ భావిస్తున్నారని తెలిసింది. ఈ ఏడాదిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు. 2024 ఇయర్ ఎండ్ కల్లా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 2025లో థియేటర్లలోకి సినిమాను తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు.
దిశ ఘటనపై తెలుగులో సినిమాలు వచ్చినా...
దిశ ఘటన మీద తెలుగులో సినిమాలు వచ్చాయి. అయితే, అవేవీ ప్రేక్షకుల మీద ప్రభావం చూపలేదు. వాళ్ళ దృష్టిని ఆకర్షించలేదు. మేఘనా గుల్జార్ దర్శకత్వం, కరీనా & ఆయుష్మాన్ వంటి నటీనటులు తోడు కావడంతో ఇప్పుడీ సినిమా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: కల్కి టికెట్ రేట్లు... ఏపీలో భారీగా పెరుగుతాయ్, కానీ తెలంగాణ కంటే రేటు తక్కువేనా?
Telangana Disha Case: అప్పట్లో దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ప్రజల్లో ఆగ్రహజ్వాలలు చల్లార్చడం కోసం ఆ నలుగురి ప్రాణాలు తీశారని కొందరు విమర్శలు చేశారు. మరి, ఏ కోణం నుంచి మేఘనా గుల్జార్ ఈ కథ చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.