Depression and Cardiovascular Health : కొందరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరికొందరు కొన్ని ఆఫీస్​ విషయాలను.. ఇతర విషయాలను పర్సనల్​గా తీసుకుని ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. దీని తీవ్రత ఎక్కువైతే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. అందుకే దీనిని తగ్గించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 


దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ గుండె సమస్యల్ని పెంచుతుందట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో ఒత్తిడి గుండె సమస్యలను పెంచుతుందని గుర్తించారు. ఆందోళన, డిప్రెషన్ వంటివి కార్డియో వాస్కులర్ ప్రమాదాన్ని పెంచుతాయని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెంటర్ హెల్త్ తెలిపింది. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్నిపెంచుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తన పరిశోధనలో పేర్కొంది. 


ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే.. 


మానసిక ఒత్తిడి గుండెను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి శరీరంలోని హార్మోన్లలో మార్పులు తీసుకువస్తుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్, అడ్రినలిన్, నోరాడ్రినలిన్​ ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇవి గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటును కూడా పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఒత్తిడి వల్ల వాపు పెరిగి.. రక్తనాళాలు దెబ్బతింటాయంటున్నారు. 


ఒత్తిడిని తట్టుకునేందుకు కొన్ని అలవాట్లు చేసుకుంటారు. స్మోకింగ్, డ్రింకింగ్, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తాయి. ఈ ఒత్తిడి గుండెకు అంతరాయం కలిగిస్తుంది. కార్డియాక్ అరెస్ట్​లకు దారి తీస్తుంది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే గుండె సమస్యలను తీవ్రం చేస్తాయి. ఇప్పటికే మీరు గుండె సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. అలాగే బీపీ సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వేగంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. మధుమేహం కూడా పెరిగే అవకాశముంది కాబట్టి.. ఒత్తిడిని కంట్రోల్ చేసే టిప్స్​ని ఫాలో అవ్వాలి. 



లక్షణాలు


హార్ట్​ ఎటాక్​ వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, చేతులు, వీపు, మెడ, దవడ, కడుపులో నొప్పి రావడం హార్ట్ ఎటాక్​కి సంబంధించిన సంకేతాలే. ఒళ్లంతా చెమటలు పట్టడం, వాంతులు, వికారం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోండి. 



ఫాలో అవ్వాల్సిన టిప్స్..


ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ రెగ్యూలర్​గా చేయాలి. వ్యాయామం చేస్తూ ఉంటే స్ట్రెస్​ తగ్గుతుంది. శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. లేదా మీరు ప్రేమించే వ్యక్తితో మాట్లాడండి. దీనివల్ల మనసు హాయిగా ఉంటుంది. టైమ్ మేనెజ్​మెంట్ చేసుకుంటూ ఉంటే స్ట్రెస్ ఉండదు. మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడంలో మొహమాట పడకండి. మీరు హ్యాపీగా ఉంటే.. పరిస్థితులు అన్ని చక్కబడతాయని గుర్తించుకోండి. 


Also Read : ఆఫ్​లు, సెలవల్లోనూ జాబ్​ టెన్షన్సే.. 88 శాతం మంది ఉద్యోగుల పరిస్థితి ఇదేనట