Health benefits of kissing : ముద్దు అనేది లవ్​ సైన్(Love Sign). ప్రేమించిన వ్యక్తికి ప్రేమను శారీరకంగా చూపించే పద్ధతిలో ముద్దు ఎప్పుడూ ముందు స్థానంలోనే ఉంటుంది. అలాంటి ముద్దుతో శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నాయి పలు అధ్యయనాలు. ముఖ్యంగా ఒత్తిడితో ఇబ్బంది పడేవారికి ముద్దు అనేది ఓ వరమట. ఇన్​స్టాగ్రామ్​లో కూడా ఈ మధ్య దీనికి సంబంధించిన రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీనిలో నిజమెంత? దీనిపై అధ్యయనాలు ఏమి తేల్చాయి? నిపుణులు ఏమి అంటున్నారు?


కిస్సింగ్, హగ్గింగ్, చేతులు పట్టుకోవడం వంటి ప్రక్రియలన్నీ శరీరంలో ఆక్సిటోసిన్​ను విడుదల చేస్తాయంటున్నారు నిపుణులు.  కేవలం శృంగారం వల్లనే కాదు.. వీటివల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు. కొందరికి ముద్దు పెట్టుకోవడం, హగ్ వంటివి సెక్యూరిటీనిస్తాయని.. భయపెట్టే అంశాలు కాదని చెప్తున్నారు. అందుకే ముద్దు అనేది శారీరక, మానసిక రిలేషన్​లో అతిపెద్ద గ్రీన్ సిగ్నల్ అని చెప్తున్నారు. అయితే దీనివల్ల శారీరకంగా, మానసికంగా కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


శారీరక ప్రయోజనాలు


ముద్దుతో ఇమ్యూనిటీ పెరుగుతుందట. లాలాజలాన్ని ఎక్స్​ఛేంజ్ చేసుకోవడం వల్ల యాంటీబాడీల్లో మార్పిడి పెరుగుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే రక్తపోటు కంట్రోల్ అవుతుందట. సన్నిహితంగా ముద్దు పెట్టుకోవండ వల్ల బీపీ కంట్రోల్ అవుతుందని.. హృదయ స్పందన రేటు కూడా తగ్గుతుందని చెప్తున్నారు. దంతాల ఆరోగ్యాన్ని కూడా ముద్దు మెరుగుపరుస్తుందట. ముద్దు ద్వారా నోట్లో లాలాజల ఉత్పత్తి పెరిగి.. దంతాలు, చిగుళ్లను శుభ్రపరుస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. 


మానసిక ప్రయోజనాలు 


ఆనందాన్ని అందించే ఎండార్ఫిన్​లు ముద్దువల్ల శరీరంలో విడుదల అవుతాయట. ఇవి ఆనందంగా ఉండేలా చేస్తాయి. ముద్దు ద్వారా విడుదలయ్యే ఆక్సిటోసిన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా కిస్ చేయడం వల్ల పార్టనర్​కు, మీకు మధ్య బంధం బలపడుతుందట. దీనివల్ల ఎమోషనల్​ బాండింగ్ ఏర్పడుతుందని చెప్తున్నాయి అధ్యయనాలు. 


శారీరక ఆప్యాయత వల్ల శరీరంలో ఆక్సీటోసిన్​ విడుదల అవుతుంది. ఇది పార్టనర్​తో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. డ్రిపెషన్​ను తగ్గించే శక్తి కిస్​కి ఉందని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్​ఫర్డ్ 2018లో చేసిన అధ్యయనంలో తేల్చింది. పార్టనర్​పై నమ్మకాన్ని.. వారి ఇష్టాలకు గౌరవించే మైండ్​సెట్​ని ముద్దు ప్రేరెపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కిస్ చేయడం, హగ్ చేసుకోవడం వల్ల శారీరక, మానసికమైన నొప్పులు దూరమవుతాయని కూడా ఈ స్టడీలో తేల్చారు. 


ముద్దులో రకాలు.. 


ముద్దుల్లో వివిధ రకాలు ఉన్నాయి. రకాలుకు తగ్గట్లే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోమాటింక్ కిస్​తో ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతుందట. ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్​లు ఆ సమయంలో విడుదల అవుతాయట. ఫ్రెంచ్​ కిస్​తో ఆనందం, కోరికతో కూడిన ప్రాంతాలు మెదడులో ప్రేరేపితమవుతాయట. పెక్​ వల్ల శరీరంలో ఎండార్ఫిన్​లు విడుదల అవుతాయి. ఆనందం పెరుగుతుంది. నుదిటిపై ముద్దు పెట్టుకోవడం వల్ల ఆప్యాయత, సేఫ్​ ఫీలింగ్స్ పెరుగుతాయట. 



ఫన్నీ ఫ్యాక్ట్స్


ముద్దు పెట్టుకోవడం వల్ల నిమిషానికి 2 నుంచి మూడు కేలరీలు ఖర్చవుతాయట. అలాగే సగటు వ్యక్తి తన జీవితకాలంలో 20 మందిని ముద్దు పెట్టుకుంటాడట. ముద్దులు ఆనందాన్ని పంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయని నమ్ముతారు. అయితే ముద్దు అనేది అందరికీ పంచే పెట్టే వస్తువు కాదు. మీ పార్టనర్​తో.. వారి ఇష్టంతో.. ఇద్దరూ కావాలనుకుని చేసే ప్రక్రియగానే ఉండాలి. మీ ఫీలింగ్​ని ఇతరులపై రుద్ది ఇదే ప్రేమ అంటూ ముద్దు పెడితే మొదటికే మోసం అవుతుంది.



Also Read : కిస్​ డే చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. మరి మీ కిస్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?