Kiss Day History : వాలెంటైన్ వీక్​ (Valentines Week 2024)లో చివరిగా వచ్చే కిస్​ డేకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజు ప్రేయసి లేదా ప్రియుడికి ముద్దు ఇచ్చేందుకు ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. వాలెంటైన్ వీక్​లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన కిస్​ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమించిన వారికి ముద్దు ఇచ్చి.. తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే ఈ వాలెంటైన్ వీక్​లో కిస్​ డే ఎలా వచ్చింది? ఎందుకు దీనిని సెలబ్రేట్ చేసుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. 


వాలెంటైన్స్ వీక్​లో ప్రేమికులు వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్లాన్ చేస్తారు. తమకు వీలుగా, అనువుగా ఉండే విధంగా ఈ వారాన్ని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ వారంలో వచ్చే కిస్​ డే ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ.. దాని చరిత్ర గురించి ఎవరికీ తెలిదు. కిస్​ డే అనేది జంటల మధ్య సంబంధాన్ని ప్రేరేపించడంలో హెల్ప్ చేస్తుంది. మీ రిలేషన్​ని నెక్స్ట్​ లెవల్​కి తీసుకెళ్లేందుకు మీరు ఈ కొత్త ప్రయాణాన్ని ముద్దుతో ప్రారంభిస్తారు. 


కిస్​ డే ప్రాముఖ్యత, చరిత్ర


కిస్​ డే అనేది వాలెంటైన్స్ డేకి శృంగారభరితమైన స్వాగతం చెప్తోంది.ఇది మీ ప్రేమ, ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ఇదో అర్థవంతమైన మార్గంగా చెప్తారు. అయితే ఇది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దు గురించి కూడా చెప్పవచ్చు. అయితే ఈ కిస్​ డే 19వ శతాబ్ధంలో విక్టోరియన్ శకంలో ప్రజాధారణ పొందిందని చెప్తారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తగనివిగా పరిగణించినప్పటికీ.. చాలా సీక్రేట్​గా దీనిని సెలబ్రేట్ చేసుకునేవారు. 


ప్రపంచంలోని వివిధ దేశాలలో ఈ రోజును ప్రసిద్ధ సంప్రదాయంగా నిర్వహించుకుంటారు. తమ సన్నిహితుల పట్ల తమ అభిమానాన్ని, ప్రశంసలను అందించేందుకు దీనిని ఉపయోగిస్తారు. కొందరు జంటలు రొమాంటిక్ ఈవెంట్లలో ముద్దుల వర్షం కురిపిస్తే.. మరికొందరు ఇంట్లోనే దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక ముద్దు ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా అనేక రకాల భావాలను తెలియజేస్తుంది.


ఒక సాధారణ ముద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం, అనుభూతిని పెంచుతుంది. వారి సంబంధాన్ని నెక్స్ట్ లెవల్​కి తీసుకువెళ్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నో విలువైన మాటలు చెప్పే సులభమైన, ప్రైవేట్ భాష ఇది. ఉద్వేగభరితమైన ముద్దులు ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు.. కిస్​ డేని జరుపుకోవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. జంటలు కలిసి సమయాన్ని గడపవచ్చు. ఒకరితో ఒకరు ప్రైవేట్ క్షణాలను పంచుకోవచ్చు. చాక్లెట్లు, పువ్వులు లేదా ప్రేమ లేఖలు ఇచ్చి ఈ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇంకా కిస్​ డేని బహిరంగంగా సెలబ్రేట్ చేసుకునే సౌలభ్యం లేదు. అందుకే మీరు దీనిని కాస్త ప్రైవేట్​గా చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్రేమించే వ్యక్తితో డేట్​కి వెళ్లి కిస్​ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. 


Also Read : మీ లవర్​కి ఇలాంటి ప్రామిస్ చేస్తే చాలు.. మీరు హ్యాపీగా ఉంటారు..