Promise Day : మీరు ప్రేమించే వ్యక్తుల ప్రేమ, సంతోషం కోసం మీరు ఎన్ని గిఫ్ట్​లైనా ఇవ్వొచ్చు. కానీ వారికి మీరు నమ్మకంగా ఓ ప్రామిస్ చేస్తే చాలు. దానికి మించిన గిఫ్ట్ మీరు ఎప్పటికీ ఇవ్వలేరు. వారు కూడా పొందలేరు. అలాంటి ఈ ప్రామిస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. వాలెంటైన్స్​ వీక్​ (Valentine Week 2024)లో దానికి ఓ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. ప్రేమించిన వ్యక్తికి లైఫ్​లాంగ్ తోడుగా ఉంటానంటూ.. వారి ఆలోచనలకు రెస్పెక్ట్ ఇస్తూ.. వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటానని చెప్తే చాలు. ఇదే మీరు వారికి ఇవ్వగలిగే అతిపెద్ద గిఫ్ట్ అవుతుంది. 


ప్రామిసే డే రోజు చాలామంది తమ వాలెంటైన్స్​కి రకరకాల ప్రామిస్​లు చేస్తారు. ఇలాంటి ప్రామిస్​లు వారి ప్రేమ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రేయసి లేదా ప్రేమికుల సంతోషం మీరు వివిధ ప్రామిస్​లు చేయవచ్చు. దీర్ఘకాలంలో మీరు వాటిని నెరవేర్చవచ్చు. కాబట్టి మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ఇష్టమైన కొన్ని విషయాల గురించి ప్రామిస్ చేయవచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రామిస్​లు చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవేంటో మీరు కూడా చూసేసి.. మీ ప్రియమైన వారికి ప్రామిస్ చేసేయండి.


ట్రిప్ ప్రామిస్


ఈ ప్రామిస్ చాలా చిన్నగా అనిపించినా.. మీ లవర్స్​తో కలిసి టూర్​కి వెళ్లొచ్చు. ఎందుకంటే ప్రేమించినా వారితో ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే అది మీకు వారికి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. సమయం, వయసు ఉన్నప్పుడే కొత్త ప్రాంతాలకు వెళ్తే మంచిది. ఇది మీకు మంచి జ్ఞాపకాలు అందిస్తాయి. డబ్బులు అయిపోతాయేమో అని భయపడకుండా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. పైగా వాలెంటైన్స్ సందర్భంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. 


సమయం..


సమయం అనేది ఏ రిలేషన్​కి అయినా స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది.  ఇది వెచ్చించలేకే చాలా మంది విడిపోతున్నారు. ప్రేమించిన వారితో అన్నిసార్లు సమయం వెచ్చించడం కుదరకపోవచ్చు. కానీ.. మీ రిలేషన్​ని స్ట్రాంగ్​ ఉంచుకోవడం కోసం మీరు కచ్చితంగా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇది మీ సంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఆ సమయంలో మీరు వారితో క్యాండిల్ లైట్ డిన్నర్స్ లేదా డేట్​లకు ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఇద్దరూ ఇంట్లో కూర్చొని నచ్చిన పని చేస్తూ ముచ్చటించుకోవచ్చు. 


కలిసి ఉంటారనే నమ్మకం


జీవితానికి గ్యారెంటీ లేకపోయినా.. మీకు ఇష్టమైన వారితో జీవితాంతం కలిసి బతుకుతామని ప్రామిస్ ఇస్తే చాలు. ఇది మీ భాగస్వామికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చేసిన ప్రామిస్​కి మీరు కట్టుబడి ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఊరికే మీరు ప్రామిస్ చేసి దానిని నిలబెట్టుకోకపోవడం కన్నా.. మీరు ఇచ్చిన ప్రామిస్​ని నిలబెట్టుకుంటే మీ రిలేషన్ చాలా అందంగా ఉంటుంది. 


సెటిల్​ అవ్వడం..


మీరు ఎంత ప్రేమను పంచినా.. మీ రిలేషన్ స్ట్రాంగ్​గా ఉండాలంటే కచ్చితంగా సెటిల్ అవ్వాలి. ఇది మీరు హ్యాపీగా కలిసి జీవితాన్ని పంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా లైఫ్​ పట్ల మీకు రెస్పాన్స్​బులిటీ పెరిగేలా చేస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండడం కంటే మీ భాగస్వామికి కావాల్సింది ఏముటుంది చెప్పండి. 


ఇలాంటి ప్రామిస్​లు మీరు కూడా మీ భాగస్వామికి చేయవచ్చు. ప్రామిస్ డే అంటే కేవలం లవర్స్​కి మాత్రమే కాదు.. మీ కుటుంబ సభ్యులకు కూడా వారిని ఆనందంగా ఉంచే ప్రామిస్​లు చేయవచ్చు. వాటిని నెరవేర్చేందుకు మీ ఎఫర్ట్స్ పెట్టండి. అవి మిమ్మల్ని ఆనందంగా మారుస్తాయి. 


Also Read : రెడ్ రోజ్ లవర్స్​కి.. పసుపు స్నేహానికి.. మిగిలిన కలర్స్ అర్థం ఏమిటంటే