Rose Day Significance : వాలెంటైన్స్​ వీక్​ వచ్చేసింది. రోజ్​ డే (ఫిబ్రవరి 7,2024) వాలెంటైన్​ వీక్​లో మొదటి రోజు. ఈ సమయంలో చాలామంది తమ ప్రేయసి లేదా ప్రియుడికి రోజాపూలు ఇచ్చి తమ ప్రేమను తెలుపుతారు. అయితే అసలు ఈ రోజ్​ డే ఎలా వచ్చింది? దానిని సెలబ్రేట్ చేసుకోవడం వెనుక చరిత్ర ఏమిటి? ఈ సమయంలో ఇష్టమైన వ్యక్తులకు ఎలాంటి రోజా పూలు ఇవ్వాలి? ఏ రంగు గులాబీలకు ఎలాంటి ప్రత్యేకత ఉందో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


రోజ్​ డే అనేది వాలెంటైన్స్​ వీక్​లో మొదటి రోజు. ఇది ప్రేమ వైపు తమ మొదటి అడుగుగా ప్రేమికులు భావిస్తారు. అందుకే తమకు ఇష్టమైన వ్యక్తులకు గులాబీలను అందిస్తారు. ప్రేమలో ఆసక్తి ఉన్న వ్యక్తికి లేదా స్నేహితులకు గులాబీలు ఇవ్వొచ్చు. ఇలా ఇవ్వడం వల్ల మీరు వారిని ఇష్టపడుతున్నారని వారితో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారనే అర్థాన్ని సూచిస్తుంది. ఇదొక ప్రేమ భాష. అయితే దీనిని కొత్తగా చేసుకోవట్లేదు. ఎప్పటినుంచో ప్రేమించిన వారికి ఎర్ర గులాబీలు అందిస్తూనే ఉన్నారు. 


రోజ్ డే చరిత్ర


పురాతన రోమన్ సంస్కృతిలో గులాబీలు, వాటి సువాసనలు వాటి అందం అంతా వీనస్ దేవతతో సంబంధం కలిగి ఉంటాయని భావించేవారు. అరేబియా దేశాల సంస్కృతులలో కూడా గులాబీలు ప్రేమ, ఇష్టానికి చిహ్నంగా నమ్ముతారు. అందుకే ప్రేమ పేరుతో రోజ్​డేని జరుపుకుంటున్నారు. అందుకే గులాబీలు ఇస్తారు. అయితే గులాబీల వివిధ రంగులు విభిన్న ఉద్దేశాలను సూచిస్తాయి. లవర్స్​కి ఎరుపు రంగు గులాబీలు ఇస్తారు. మరి వివిధ రంగులు ఏయే ఉద్దేశాలను తెలుపుతాయంటే.. 


రెడ్ రోజ్


ఎరుపు గులాబీలు ప్రేమ, రొమాన్స్​కి చిహ్నం. రోజ్​ డే రోజు అత్యంత ప్రజాధారణ పొందిన వాటిలో ఇవి ఒకటి. ఇవి లోతైన భావోద్వేగాలకు సంకేతంగా చెప్తారు. ఇవి ప్రేమ, రొమాన్స్​లో స్వచ్ఛతకు మారు పేరని అంటారు. అందుకే మీరు ప్రేమించే వ్యక్తులకు రోజ్​ డే రోజు రెడ్ రోజ్ ఇచ్చేయండి. 


పింక్ రోజ్


పింక్ గులాబీలు మాధ్యుర్యం, ప్రశంసలు, కృతజ్ఞతలకు గుర్తుగా ఇస్తారు. ఇవి ఆనందాన్ని సూచిస్తాయి. భాగస్వాములు, తోబుట్టువులు, స్నేహితులకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు రోజ్​ డే రోజు పింక్ రోజ్​ ఇవ్వొచ్చు. ఇది స్వచ్చతతో ముడిపడి ఉంటుంది. 


ఎల్లో రోజ్


పసుపు గులాబీలు స్నేహం, ఆనందం, సానుకూలతను సూచిస్తాయి. మీ ఆనందం, స్నేహాన్ని వ్యక్తీకరించడానికి ఇవి బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా మంచి ఆరోగ్యానికి గుర్తుగా వీటిని అందిచవచ్చు. పసుపు గులాబీలు ఇవ్వడమనేది మీ స్నేహానికి గుర్తుగా.. మీరు వారికి ఇచ్చే విలువను తెలియజేస్తుంది.


వైట్ రోజ్


స్వచ్ఛత, ఇన్నోసెన్స్, కొత్త ప్రారంభాలకు గుర్తుగా తెలుపు గులాబీలు ఇవ్వొచ్చు. ఇవి ప్రశంసలు, గౌరవం, కొత్త పరిచయాలను వ్యక్తపరిచేందుకు అందమైన మార్గంగా మారుతాయి. తెలుపు రంగు ఆశ, ప్రేమ, గౌరవాన్ని సూచిస్తుంది. ఇది మీ వాలెంటైన్స్​ డేకి అర్థవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు. 


పీచ్ రోజ్ 


పీచ్ గులాబీలు చిత్తశుద్ధి, ఆప్యాయత, నిజమైన ప్రేమను సూచిస్తాయి. తమ ప్రేమను మరింత సన్నిహితంగా, వ్యక్తిగతంగా జరుపుకోవాలనుకునే జంటలకు ఇవి బెస్ట్ ఆప్షన్. మీ వాలెంటైన్​కి రోజ్​ డే రోజు రోజ్​తో ప్రపోజ్ చేయాలనుకుంటే ఇవి మంచి ఎంపిక. 


లావెండర్ రోజ్


రోజ్​ డే రోజు మీరు లావెండర్ రోజ్​లను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి సున్నితమైన, దయ, జాలికి గుర్తు. మీరు ఆరాధించే వ్యక్తికి ఇవి ఇవ్వడమనేది ఆలోచనాత్మకమైన ఎంపిక. ఇవి చాలా అరదుగా దొరుకుతాయి. అందమైనవి. అందుకే వీటిని లవ్​ ఎట్​ ఫస్ట్​ సైట్​ అని చెప్పడానికి చిహ్నంగా కూడా ఇస్తారు. 


ఇంకెందుకు ఆలస్యం. ఏయే రోజ్​లు ఏయే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో తెలిసిపోయిందిగా. మీరు కూడా మీ ప్రాముఖ్యతకు తగ్గట్లు మీకు నచ్చిన వ్యకి ఈ రోజా పూలు ఇచ్చేసి రోజ్​డే సెలబ్రేట్ చేసేసుకోండి. 


Also Read : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. ఒక్కోరోజు ఒక్కోలా ప్రేమను వ్యక్తం చేసేయండి