Valentines Week Full List : ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికులు పండుగ చేసుకుంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే (Valentines Day 2024)జరుపుకుని.. తమ ప్రేమికులకు ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే సంవత్సరంలో ఏ రోజుకి లేనంతగా వాలెంటైన్స్ డేకి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవాన్ని వారం రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వాలెంటైన్స్ వీక్‌లో ఒక్కోరోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 14కి వారం ముందుగా అంటే ఫిబ్రవరి 7 నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
వాలెంటైన్స్‌డే అనేది పాశ్చత్యా ధోరణి అయినా ఇండియాలో చాలామంది దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనిని ప్రేమ, ఆనందం, అందమైన భావోద్యేగాలకు గుర్తుగా చేసుకుంటారు. తమ ప్రియమైన వారికి ఈ వారంలో ప్రత్యేక బహుమతులు, సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. ఈ వాలెంటైన్స్ వీక్‌ని లవ్ వీక్, రొమాన్స్ వీక్ అని కూడా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్ రోజ్ డే నుంచి ప్రారంభమై.. వాలెంటైన్స్ డే వరకు వీక్‌లో ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం.
వాలెంటైన్స్ డే వీక్‌లో రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే ఉంటాయి. వాలెంటైన్స్ డే అంటే కేవలం గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్‌కే కాదు.. భార్య భర్తలు కూడా దీనిని చేసుకోవచ్చు.
రోజ్ డే (Rose Day 2024)
రోజ్ డే అనేది వాలెంటెన్స్ వీక్‌లో మొదటి రోజు. దీనిని ఫిబ్రవరి 7న జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమ, ఆప్యాయత, అభిరుచికి చిహ్నమైన గులాబీలు ఇస్తారు. గులాబీని ఇచ్చి.. మీరు ప్రేమించే వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఎర్ర గులాబీలు గాఢమైన ప్రేమను తెలిపేందుకు మంచి ఎంపిక.
ప్రపోజ్ డే (Propose Day 2024)
వాలెంటైన్స్ వీక్‌లో ప్రపోజ్ డే రెండవ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు మీరు ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేసి.. డేట్‌కి తీసుకెళ్లవచ్చు. నైట్ డేట్‌కి తీసుకువెళ్లడం అనేది మంచి ఎంపిక అవుతుంది. దానిని మీరు రోమాంటిక్ డేట్‌గా కూడా మార్చుకోవచ్చు.
చాక్లెట్ డే (Chocolate Day 2024 )
చాక్లెట్ డే వాలెంటైన్స్ వీక్‌లో మూడవ రోజు వస్తుంది. చాక్లెట్‌లోని మాధుర్యం తమ ప్రేమలో కూడా ఉండాలని దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. మీ పార్టనర్‌కి స్వీట్స్ అంటే ఇష్టముంటే మీరు రకరకాల చాక్లెట్స్‌ను వారికి ఇవ్వొచ్చు.
టెడ్డీ డే (Teddy Day 2024)
ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డే చేసుకుంటారు. ఇది వాలెంటైన్ వీక్‌లో నాల్గవ రోజు. ఈ రోజు టెడ్డీ బేర్స్‌ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఈ టెడ్డీలు ఇది ఆనందానికి, ఉల్లాసానికి గుర్తుగా ఇస్తారు. మీరు కూడా ప్రేమించే వ్యక్తికి.. మంచి రంగులో టెడ్డీని సెలక్ట్ చేసి గిఫ్ట్ ఇవ్వొచ్చు.
ప్రామిస్ డే (Promise Day 2024)
వాలెంటైన్స్ వీక్‌లో ప్రామిస్ డే చాలా స్పెషల్. ఎందుకంటే ఎన్ని గిఫ్ట్‌లు ఇచ్చినా.. రాని కిక్.. ఒక్క ప్రామిస్‌తో వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తికి.. మీ ప్రేమను తెలియజేస్తూ.. నమ్మకంగా జీవితాంతం తమతోనే ఉంటామని ప్రామిస్ చేస్తే చాలు. ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రామిస్ చేస్తే సరిపోతుంది అనుకునే బదులు.. ప్రామిస్‌ని నిలబెట్టుకుంటే మంచిది.
హగ్ డే.. (Hug Day 2024)
లవ్ వీక్‌లో ఆరవ రోజు హగ్ డే. ఇది ప్రేమించిన వ్యక్తికి భద్రతనిస్తూ.. వారు ఒంటరి కాదని.. హగ్ ఇవ్వొచ్చు. అయినా హగ్ అనేది స్ట్రెస్, బాధలను దూరం చేస్తుంది కాబట్టి.. దీనిని మీరు కేవలం ప్రేమించిన వ్యక్తితో కాకుండా మీరు ఇష్టపడే, వెల్విషెర్స్కి కూడా హగ్ ఇవ్వొచ్చు.
కిస్ డే (Kiss Day 2024)
ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డే జరుపుకుంటారు. కిస్ అనేది ఒకరి పట్ల మరొకరు చూపించే అత్యంత సన్నిహితమైన, స్వచ్ఛమైన ప్రేమకు రూపం. ఈ రోజు మీరు మీ భాగస్వామికి ముద్దు పెట్టి మీ ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు.
వాలెంటైన్స్ డే (Valentines Day 2024 )
వాలెంటైన్స్ వీక్‌లో ఇది చివరిది. ఈ ప్రత్యేకమైన రోజు జంటలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందకంటే ఇది అన్నిరూపాల్లో ప్రేమను వ్యక్తం చేసేందుకు ముఖ్యమైన రోజు. ఈరోజు మీ వాలెంటైన్‌తో కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేయవచ్చు. వారిని తీసుకుని మంచి హాలీడే స్పాట్‌కి వెళ్లొచ్చు. ఈ వాలెంటైన్ వీక్‌ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పటినుంచే డిసైడ్ అయిపోండి.
Also Read : హాబీ డే గురించి మీకు తెలుసా? 2024లో బాగా వైరల్ అవుతున్న ట్రావెల్ ట్రెండ్