Nindu Noorella Saavasam Serial Today Episode: వీళ్లు మీ పిన్ని మావయ్య అని నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు అమర్.


మిస్సమ్మ : నేను నిజం చెప్పాలని మీ దగ్గరికి వచ్చాను కానీ ఇంతలో ఫోన్ వచ్చింది అంటుంది.


అమర్: మరో అబద్ధం చెప్తున్నావా అంటాడు.


రాథోడ్: లేదండి, నిన్న రాత్రి మిస్సమ్మ మీతో ఈ విషయం మాట్లాడ్డానికే వచ్చింది అంటాడు.


మనోహరి : మరి నిన్న రాత్రి అడిగితే నాకు ఏమీ తెలియదు అని చెప్పావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ అందరూ కలిసి అమర్ ని మోసం చేస్తున్నారా.. నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్పావంటే ఇంక దేనికైనా తెగిస్తావు. నువ్వు ఇంక ఇంటికి రావద్దు ఇటు నుంచి ఇటే మీ ఇంటికి వెళ్ళిపో. నీ సామాన్లు వేరే మనిషికి పంపిస్తాము అంటుంది.


కోపంతో అమర్, మనోహరి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రాథోడ్ కూడా మిస్సమ్మ కి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది.


మంగళ: పంతులు గారితో మాట్లాడాను రెండు రోజుల్లో పెళ్లంట అని చెప్తుంది.


మిస్సమ్మ : అన్ని మీరే చూసుకోండి, ఎప్పుడు వచ్చి పీటల మీద కూర్చోమంటే అప్పుడు వచ్చి తాళి కట్టించుకుంటాను అని ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది.


ఆనందంతో గంతులు వేస్తారు మంగళ, కాళీ. మరోవైపు ఏడుస్తున్న కూతుర్ని చూసి నిజం చెప్పటానికి ప్రయత్నిస్తూ చేతిని ఆడిస్తాడు రామ్మూర్తి.


మిస్సమ్మ: ఆ భాష అర్థం చేసుకోలేక నువ్వేమీ బాధపడకు నాన్న, నువ్వు చెప్పినట్లే నేను మావయ్య ని పెళ్లి చేసుకుంటాను అని ఏడుస్తూ కింద కూలబడిపోతుంది.


రామ్మూర్తి : ఆ పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, ఈ విషయం నీకు ఎలా చెప్పటం అని కన్నీరు పెట్టుకుంటాడు.


మరోవైపు మిస్సమ్మ చూడటానికి అరుంధతి దగ్గరికి వెళ్తుంది. రామ్మూర్తిని చూసి షాక్ అవుతుంది. ఈయన మిస్సమ్మ తండ్రా.. మరి ఈయనని చూస్తే నాకెందుకు గుండెల్లో ఏదోలా అనిపిస్తుంది. అసలు వీళ్ళకి నాకు సంబంధం ఏమిటి అనుకుంటుంది. ఇంతలో కాళీ వాళ్ళు అక్కడికి వస్తారు.


కాళీ : ఎంత మంచి పని చేసావ్ అక్క అని సంతోషంగా అంటాడు.


మంగళ: అవున్రా ఒక్క దెబ్బతో నీకు భాగి, నాకు మనోహరి ఇచ్చే 50 లక్షలు అంటుంది.


కాళీ : అసలు భాగిని నేను పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఆవిడకి ఏమిటి లాభం అంటాడు.


మంగళ: మన డబ్బులు మనకు వస్తున్నప్పుడు ఆవిడకి ఏంటి లాభం అనే విషయం మనకి అనవసరం. ఒక్కసారి ఈ పెళ్లి అవ్వని తండ్రి కూతుర్లిద్దరిని మన కాళ్ళ దగ్గర ఉంచుకుందాం అంటుంది.


ఈ మాటలు విన్న అరుంధతి కంగారు పడిపోతుంది. అందరూ కలిసి మిస్సమ్మ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు అలా జరగనివ్వను ఇప్పుడే విషయాన్ని మిస్సమ్మకు చెప్తాను అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోతుంది. ఇంతలో చిత్రగుప్తుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. భగవంతుడిని తిట్టుకుంటుంది. ఈ సమయంలో మిస్సమ్మకి సాయం చేసే వారు ఎవరూ లేరా అని అనుకుంటుంది.


మరోవైపు ఇంటికి వచ్చిన అమర్ వాళ్ళని మిస్సమ్మ తండ్రికి ఎలా ఉంది అని అడుగుతారు అతని తల్లిదండ్రులు.


మనోహరి: ఆ మిస్సమ్మ మనల్ని అందరినీ మోసం చేసింది అంటూ జరిగిందంతా చెబుతుంది.


అమర్ తండ్రి : మోసం అంటున్నావు, ఇందులో మిస్సమ్మ చేసిన మోసం ఏముంది. ఆమె ఎప్పుడూ నిజాయితీగానే ఉంది పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంది. తనని అపార్థం చేసుకోవద్దు అని కొడుక్కి చెప్తాడు.


అమర్: నాన్న ఆ విషయం వదిలేయండి, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనోహరికి పెళ్లి చేయడం నా బాధ్యత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ముందు పంతులు గారిని పిలిపించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమర్ తల్లిదండ్రులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మనోహరి ఎంతో ఆనందపడుతుంది.


నీల : అమర్ అయ్యగారు వేరే సంబంధం చూస్తాను అంటే అంత ఆనందపడుతున్నారు ఏంటి అంటుంది.


మనోహరి : అమర్ అలా అంటాడని నాకు తెలుసు అందుకే నా ప్లాన్ లో నేను ఉన్నాను. నేల అర్థం కానట్లు మొహం పెడుతుంది. పంతులుగారు వస్తారు కదా అప్పుడు నీకే తెలుస్తుంది అంటుంది మనోహరి. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.