Krishna Mukunda Murari Today Episode: ముకుందకు భవాని అంటే ఏంత ఇష్టమో ఆదర్శ్‌ తన తల్లికి చెప్తాడు. ఆదర్శ్‌ని అడ్డుకున్న ముకుంద ఒకరి మీద ఇష్టం వాళ్లకు మనం ఇచ్చే విలువ బట్టి తెలిసిపోతుంది కదా అని మురారిని అడుగుతుంది. 


ముకుంద: చెప్పు మురారి తెలిసిపోతుంది కదా.. మళ్లీ చెప్పుకోవడం అవసరమా.. 
సుమలత: నిజమే కదా మురారి తెలిసిపోతుంది కదా.. పెద్దక్కకి ఎవరు ఏంటో తెలుసు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 
రేవతి: మనసులో.. వీళ్లు ఇంత బాగున్నారు కదా మరి అక్క ఎందుకు ఆదర్శ్ రావడం కరెక్టేనా అని అడిగింది. ఒకవేళ ఓమూలన అనుమానం ఉన్నా ఈ క్షణంతో అది తొలగిపోయి ఉంటుంది. 


మరోవైపు మురారి తాగిన మైకంలో బెడ్ మీద కాకుండా కింద పడుకుంటాడు. ఎందుకు అని కృష్ణ అడిగితే ఫస్ట్‌ నైట్ అయ్యే వరకు బెడ్ మీద పడుకోను అంటాడు. దీంతో ఇద్దరం పైనే పడుకుందాం అని కృష్ణ అంటుంది. ఇక ఆదర్శ్‌ని తీసుకొచ్చనందుకు కృష్ణకు మురారి థ్యాంక్స్‌ చెప్తాడు. మరోవైపు ఆదర్శ్‌ బెడ్ మీద తన పక్కన ముకుంద లేదు ఏంటని చూస్తాడు. రూమ్‌లో ముకుంద లేకపోయే సరికి మొత్తం వెతుకుతాడు. నేల మీద చాప దిండు ఉండటం చూసి కింద పడుకుందా.. ఎందుకు తన పక్కన పడుకోలేదు అని అనుకుంటాడు. 


ఆదర్శ్‌: రాత్రి వరకు ముకుంద బాగానే ఉంది కదా.. మరి ఇంతలో ఏమైంది. అసలు ముకుంద మనసులో నేను ఉన్నానా.. లేనా అని అన్ని ఆలోచిస్తాడు. 
ముకుంద: లేచారా నిద్ర ఎందుకు డిస్ట్రబ్ చేయడం అని నేనే లేపలేదు. 
ఆదర్శ్‌: నన్ను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదు అని నువ్వు లేపలేదు. కానీ నేను లేచాక డిస్ట్రబ్ అయ్యాను.
ముకుంద: ఏమైంది ఆదర్శ్‌.
ఆదర్శ్‌: ముకుంద నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు. నిజంగానే నా మీద నీకు ఇష్టం ఉందా.. మనస్ఫూర్తిగానే నన్ను ఇక్కడికి రప్పించావా..
ముకుంద: ఈయనకు నా మీద అనుమానం వచ్చిందా బాగానే ఉన్నాను కదా ఈయనతో.. 
ఆదర్శ్‌:  లేదంటే నన్ను ఇక్కడికి రప్పించడానికి ఇష్టం ఉన్నట్లు నటించావా..  
ముకుంద: ఏమైంది ఆదర్శ్‌ ఎందుకు మీకు ఈ అనుమానం వచ్చింది. 
ఆదర్శ్‌:  ఎందుకా ఇందుకు అంటూ కింద పరుపు చూపిస్తాడు.
ముకుంద: ఓ ఇదా సంగతి లేచాక తీయడం మర్చిపోయానే చా.. ఇదా మీ అనుమానానికి కారణం.. మీరు అనుకున్నట్లు ఏం లేదు. ఇంకా మన శోభనానికి ముహూర్తం పెట్టలేదు కదా.. అంత వరకు ఒకే మంచం మీద కలిసి పడుకుంటే అరిష్టం అని కింద పడుకున్నాను.
ఆదర్శ్‌:  మరి నిన్నా మొన్నా పడుకున్నావ్ కదా అప్పుడు లేని అరిష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది. 
ముకుంద: నిన్నా మొన్నా కూడా నేను కిందే పడుకున్నాను. మీరు నిద్ర పోయిన తర్వాత నేను నిద్ర పోయేదాన్ని మీరు లేవక ముందే నేను నిద్ర లేచేదాన్ని. అనవసరంగా ఏదేదో ఊహించుకొని మీరు నా మీద అనుమానం పెట్టుకోకండి సరేనా..
ఆదర్శ్‌:  ముకుంద నా మీద నీకు ప్రేమ లేదని తెలిసి వెళ్లిపోయిన వాడిని. వచ్చాక కూడా నువ్వు అలాగే ఉంటే అదే అభిప్రాయం ఉంటుంది కదా.. 
ముకుంద: అలా అయితే మీ అభిప్రాయం మార్చుకోండి. నేను దూరంగా ఉండటానికి కారణం ఇదే.. మనసులో.. సారీ ఆదర్శ్‌ ప్రేమ లేకపోయినా ఉందని చెప్తున్నా.. 
ఆదర్శ్‌: సరే నమ్ముతున్నాను. కానీ శోభనం జరగకుండా ఒకే మంచం మీద పడుకోకూడదు అని నేను వినలేదు. మురారి, కృష్ణలు కలిసే ఉంటున్నారు కదా వాళ్లని పిలిచి అడుగుదామా..
ముకుంద: ఆదర్శ్ వాళ్ల పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు వాళ్లు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఒక్కటి అవ్వొచ్చు. దూరం అవుతారు అనే భయం లేదు. కానీ మన పరిస్థితి అలా కాదు. అత్తయ్య గారు ముహూర్తం పెడతారు కదా అప్పటివరకు ఓపిక పట్టండి అప్పుడు మీకే అర్థమవుతుంది. మరోవైపు కృష్ణ మురారి కోసం కాఫీ తీసుకొని వస్తుంది. మురారి కృష్ణను తాకాలని చూస్తాడు. దీంతో కృష్ణ మురారి చేతిలో వేడి కాఫీ పెడుతుంది. దీంతో మురారి షాక్ అవుతాడు. ఇక మురారి కృష్ణని పట్టుకోవాలి ప్రయత్నిస్తే కృష్ణ పరుగెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: హనుమాన్ 17డేస్ కలెక్షన్స్‌: ఆ విషయంలో ‘RRR’ని దాటేసిన 'హనుమాన్‌'