Hanuman Records: 'హనుమాన్‌' ఇప్పుడు ఏ ఇద్దరు సినిమా లవర్స్‌ మాట్లాడుకున్న ఈ మూవీ గురించే చర్చ. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా సరే.. ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌ స్కిల్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా ఆకట్టుకుంది 'హనుమాన్‌' సినిమా. అలానే కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది ఈ సినిమా. బాక్సాఫీస్‌ దగ్గర తన సత్తా చాటుతూనే ఉంది. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతోంది. 'హనుమాన్‌' సినిమా ఈ వారాంతంలో దాదాపు రూ.29 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది. ఇక సినిమా మొత్తం కలెక్షన్లు రూ.254 కోట్లు దాటిపోయింది. 


'RRR' రికార్డు బద్దలు.. 


మూడోవారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయింది 'హనుమాన్‌' బాహుబలి కలెక్షన్ల తర్వాత ఈ సినిమాకే అన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మూడో వారం తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్లలో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాని కూడా బీట్‌ చేసింది. ఇక అంతేకాకుండా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఇప్పటి వరకు ఉన్న 'అల వైకుంఠపురం' సినిమా రికార్డులను కూడా బీట్‌ చేసింది 'హనుమాన్‌'. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల కలెక్షన్లలో 8వ అతిపెద్ద సినిమాగా 'హనుమాన్‌' రికార్డులు సృష్టించింది. నార్త్‌ అమెరికాలో దాదాపు ఐదు మిలియన్ల కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసింది 'హనుమాన్‌'. ఆ రీజన్‌లో ఇప్పటివరకు 'బాహుబలి 1, 2', 'ఆర్‌ ఆర్‌ ఆర్‌', 'సలార్‌' సినిమాలు మాత్రమే ఇంత రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టగలిగయి. ఇకపోతే.. 'హనుమాన్‌'తో పోలిస్తే  ఆ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌ సినిమాలు.


ఏరియావైజ్‌ కలెక్షన్లు ఇలా.. 


17వ రోజు ఏరియావైజ్‌ కలెక్షన్లు చూస్తే.. నిజామ్‌ రూ.30.10 కోట్లు, సీడిడ్‌ రూ.10.26కోట్లు, యూఏ రూ.9.08 కోట్లు, గుంటూరు రూ.5.03 కోట్లు, ఈస్ట్‌ రూ.5.93 కోట్లు, వెస్ట్‌ రూ.4.15 కోట్లు, కృష్ణ రూ.3.54 కోట్లు, నెల్లూరు రూ.1.86 కోట్లు, ఆర్‌వోఐ రూ.31 కోట్లు, ఓవర్‌ సీస్‌ రూ.26.90 కోట్లుగా ఉన్నాయి.


జనవరి 12న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పరిమిత స్క్రీన్లలో రిలీజ్‌ అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ అందుకోవడంతో థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అంచనాలకు మించి సినిమా ముందుకు దూసుకుపోతోంది. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా సినిమా వావ్‌! అనిపించేలా కలెక్షన్లు రాబడుతోంది.


ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తీస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించింది. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్‌ వర్మ. ఇక సీక్వెల్‌లో తేజ సజ్జ హీరో కాదని, హనుమాన్‌ హీరో అని చెప్పారు. మరి సకెండ్‌ పార్ట్‌లో హనుమాన్‌గా ఎవరు నటించబోతున్నారో అందరిలో ఉత్కంఠ నెలకొంది. లిమిటెడ్‌ బడ్జెట్‌లో భారీ విజువల్‌ ఫీస్ట్‌ని ప్రేక్షకుల ముందు ఉంచారు ప్రశాంత్‌ వర్మ. దీంతో ఇప్పుడు 'జై హనుమాన్‌' మీద ఇంతే భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి ఇది ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.


Also Read: మరింత ఆలస్యంగా ఓటీటీలోకి 'హనుమాన్' - కారణం అదే!