New Travel Trend : మీకు ట్రావెల్ చేయడం ఇష్టమా? లేక వంట చేయడం ఇష్టమా? పెయింటింగ్ వేయడం మీ హాబీనా? ఫ్రెండ్స్​తో కలిసి ఎంజాయ్ చేయాలని ఉంది కానీ వారిని కలవలేకపోతున్నారా? పని ఒత్తిడి ఎక్కువైపోయి.. మీకు ఇష్టమైన పనులు చేయలేకపోతున్నారా? ఏదొక రోజు మనకు నచ్చిన పని చేద్దాంలే అనే ఆలోచనలతోనే మీ జీవితం కంప్లీట్ అయిపోతుందా? అయితే మీరు ఈ కొత్త ట్రెండ్​ని ఫాలో అవ్వొచ్చు. అదే హాబీ డే. 2024లో ఈ ట్రావెల్ ట్రెండ్ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. హాబీడే అంటే హీబీ, హాలీడేల సమ్మేళనం. మీ ఇష్టమైన హాబీని హాలీడేతో కలిపి ఎంజాయ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. 


శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యంపై ఈ మధ్య అవగాహన పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలామంది మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రశాతంగా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈ హాబీడే అనే రోజును తెరపైకి తీసుకొచ్చారు. ట్రావెల్​లో చేస్తూ నచ్చిన పని చేయడం కూడా దీనిలో ఓ భాగమే. లేకుంటే ఇంట్లోనే ఉంటూ మీకు నచ్చిన హాబీలతో రోజూను పూర్తిగా గడిపేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత రోజుకు మీరు చాలా యాక్టివ్​గా ఉంటారు. 


హాబీ + హాలీడే


అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా కుకింగ్ అంటే ఇష్టముంటుంది. అలాగే బేకింగ్, క్రాఫ్ట్స్​, గార్డెనింగ్, ట్రెక్కింగ్, పెయింటింగ్, పాటలు పాడటం, కుండలు వంటి క్లే బొమ్మలు చేయడం వంటివి హాబీలలో భాగమే. అయితే వీటిని రోటీన్​గా ఇంట్లో చేయకుండా.. మీకు నచ్చిన హాబీని చేసేందుకు వీలుగా ఉండే ప్రాంతాలకు చెక్కేయడమే దీనిలో భాగమే. మీ అభిరుచులను బట్టి మీరు వెళ్లాలనుకునే ప్రాంతాలను ఎంచుకోవచ్చు. మీకు పాటలు ఇష్టమైతే.. మీకు హాలీడే సమయంలో లైవ్ మ్యూజిక్​కి వెళ్లొచ్చు. బుక్స్ ఇష్టమైతే.. మంచి లైబ్రరీకి వెళ్లొచ్చు. ట్రావెల్​ చేయడం ఇష్టమైతే వివిధ ప్రాంతాలు చుట్టేయొచ్చు. ఉదాహరణకు బోటింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాల కోసం కేరళ వంటి ప్రాంతాలు వెళ్లొచ్చు అనమాట. దీనివల్ల మీరు ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. మీకు ఇష్టమైన కార్యకలాపాలు చేసేందుకు వీలుగా ఉంటుంది. 


హాబీడే టిప్స్


ఈ పనులు చేయడం కోసం పెద్దగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే హాలీడే ఉంటుందో.. ఆ రోజు వీటిని కచ్చితంగా జరిగేలా చూసుకుంటే సరిపోతుంది. ఆ హాలీడేలకు సెలవలు జోడించి.. మీ ట్రిప్​ని, హాబీలను ఎంజాయ్ చేయవచ్చు. అయితే మీరు హాబీడే ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఇవి మీకు ఓ అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇస్తాయి. 


మీ హాబీడేలకు వెళ్లేప్పుడు గాడ్జెట్​లు, ఎలక్ట్రికల్ పరికరాలు తీసుకువెళ్తే మంచిది. లేదా మీరు వెళ్లే ప్రాంతంలో సర్వీస్ ప్రొవైడర్స్, వాటిని రెంట్​గా ఇస్తారో లేదో తెలుసుకుని వెళ్లండి. లేదంటే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు వెళ్లే ప్రదేశంలో వాతావరణం, ఆహారంలో మార్పుల గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్లండి. లేదంటే అక్కడ వెదర్, ఫుడ్ మీ హాబీడేని పూర్తిగా డిస్టర్బ్ చేస్తాయి. అలాగే మీరు వెళ్లాలనుకునే ప్రాంతాలకు చేరుకునేందుకు ట్రావెల్ చేయడానికి అయ్యే ఖర్చులపై కచ్చితంగా ఓ అంచనా ఉండాలి. అక్కడికి వెళ్లి డబ్బులకోసం ఇబ్బంది పడకుండా జర్నీని ముగించుకోవచ్చు. 


హాబీడే ట్రెండ్​ను ప్రమోట్ చేస్తున్న హోటళ్లు


ఈ హాబీడే ట్రెండ్​ను పలు హోటళ్లు బాగానే ఉపయోగించుకుంటున్నాయి.  పలు హోటళ్లు కుకింగ్ క్లాస్​లు, బేకింగ్ పాఠాలు వంటివి నేర్పిస్తున్నాయి. మరికొన్ని హోటళ్లు స్టార్ గేజింగ్ సెషన్​లను అందిస్తుంది. న్యూఢిల్లీలోని పలు హోటళ్లు ఫోటోగ్రఫీ టిప్స్, ప్రకృతికి సంబంధించిన టూర్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో క్లేతో నచ్చిన వస్తువులు చేసేందుకు సౌలభ్యం కలిపిస్తున్నాయి. వీకెండ్ ఫార్మింగ్ చేసే ఆప్షన్స్ కూడా చాలా మన ముందు ఉంటున్నాయి. 


హాబీడేలపై జరిపిన అధ్యయనాలు హాబీలు, శ్రేయస్సు మధ్య సంబంధాలపై మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇవి మీ మానసిక ఆరోగ్యం, అభిరుచులను నెరవేర్చుకోవడం కోసం హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించుకోవడంలో, మెదడుకు విశ్రాంతిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు సెలవులను సంతృప్తికరంగా మార్చుకోవడం కోసం ఈ హాబీడేలను ప్లాన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కువ జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరుంటున్న ప్రాంతానికి దగ్గర్లోనే ఈ హాబీడేను ప్లాన్ చేసుకోవచ్చు. 


Also Read : రోజంతా యాక్టివ్​గా ఉండేందుకు.. మీ రోటీన్​లో వీటిని చేర్చుకోండి