Brahmamudi Serial Today Episode: పిజ్జా డెలివరీ జాబ్‌లో అప్పు జాయిన్‌ అవుతుంది. ఆ జాబ్‌ ఇప్పించిన తన ఫ్రెండ్‌కు థాంక్స్‌ చెప్పడానికి అప్పు వెళ్తుంది. తనకు థాంక్స్‌ వద్దని కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుని ఉంటే నేవ్వే మా లాంటి వాళ్లకు ఎంతో మందికి జాబ్‌ ఇప్పించే పొజిషన్‌లో ఉండేదానివని అంటుంది. దీంతో అప్పు కోపంగా తన ఫ్రెండును తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపపు దుగ్గిరాల వాళ్ల ఇంట్లో అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని తింటుంటారు. కావ్య వడ్డిస్తుంది. ప్రకాష్‌ అటు ఇటు చూసి..


ప్రకాష్‌: ధాన్యం కడుపులో పిల్లులు పరుగెడుతున్నాయే..


కళ్యాణ్‌: ఎలుకలు కదా నాన్నా పరిగెత్తాల్సింది.


ప్రకాష్‌: ఆ ఎలుకలని పిల్లులు తరిమేశాయిలేరా?


రుద్రాణి: నెక్ట్స్‌ పిల్లుల్ని తరిమేయడానికి కుక్కలు వస్తాయేమే..


ప్రకాష్‌: అందుకే కుక్కలా అరుస్తున్నాను. ధాన్యం..


 అని కేకలు వేయగానే ధాన్యలక్ష్మీ వస్తున్నానండి అంటూ మాడిపోయిన బ్రెడ్‌ ఆమ్లేట్‌ తీసుకొస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ప్రకాష్‌ నేను ఈ గడ్డి తినను అంటాడు. అయితే నేను ఇదే తింటాను అంటుంది ధాన్యలక్మీ.  ప్రకాష్ కావ్యను   అడిగి పెసరట్టు వేసుకుంటాడు. ధాన్యలక్ష్మీ, అనామిక మాత్రం మాడిపోయిన బ్రెడ్‌ ఆమ్లేట్‌ తింటుంటారు. ఇంతలో కళ్యాణ్‌ చిన్నగా కావ్యను పిలిచి అడగండి అంటూ సైగ చేస్తాడు. కావ్య మెల్లగా అపర్ణ దగ్గరకు వెళ్లి..


కావ్య: అత్తయ్య నేను ఇవాళ్టీ నుంచి మన ఆఫీసులో డిజైనర్‌గా జాయిన్‌ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే వెళ్తాను.  


కళ్యాణ్‌: పెంటాస్టిక్‌, సూపర్‌ వదిన మీలో ఉన్న కళని ఇలా పెసరట్టుకు వంటింటికి పరిమితం చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. మంచి ఆలోచన


ధాన్యలక్ష్మీ: రేయ్‌ నువ్వు ఆగుతావా?


కళ్యాణ్‌: ఏంటి ఆగేది అమ్మా గదిలో కూర్చుని జుట్టు పీక్కుని శూన్యంలోకి చూస్తూ  నేను రాస్తున్న కవితలను వదిన కానీ పట్టించుకోకపోయి ఉంటే మీ దృష్టిలో పిచ్చి రాతలుగానే మిగిలిపోయి ఉండేవి. వదిన పూనుకుని పుస్తకంలో అచ్చు వేయించబట్టే కదా అనామికకు నచ్చింది. నాకు కవిగా పేరేచ్చింది.


రుద్రాణి: నువ్వు చెప్పింది బాగానే ఉందిరా కానీ దొంగతనం చేస్తానంటూ పోలీసులతోనే చెప్పినట్టు ఉంది.


సుభాష్‌: అదేం పోలిక రుద్రాణి.


రుద్రాణి: కావ్య ఆఫీసుకు వెళ్లకపోవడానికి కారణమే మీ ఆవిడ అన్నయ్యా పోయి పోయి వదిన్నే కావ్య పర్మిషన్‌ అడుగుతుంది.


ధాన్యలక్ష్మీ: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వీళ్ల వంశంలోనే లేదు. మాట తప్పడం మోసం చేయడం తప్పా వీళ్లకు ఏం చేతనవుతుందిలే


ప్రకాష్‌: నువ్వు తినే గడ్డి బాగానే వర్కటవుట్‌ అవుతుంది. పశువుల లక్షణాలు బాగానే బయటపడుతున్నాయి.  


కావ్య: చిన్నత్తయ్యా నేను ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్పడం లేదు.


ధాన్యలక్ష్మీ: నన్ను అత్తయ్యా అని పిలిచే అర్హత నీకు లేదు.


స్వప్న: సరే ధాన్యలక్ష్మీ అని పిలవ్వే


ధాన్యలక్ష్మీ: ఏంటి ఎంత ధైర్యం నీకు నన్నే పేరు పెట్టి పిలవమంటున్నావా?


స్వప్న: ఏంటి ఆటలుగా ఉందా మీకు అత్తయ్య అని పిలిస్తే పిలచే అర్హత లేదు అంటున్నారు. పేరు పెట్టి  పిలిస్తే ఎంత ధైర్యం అంటున్నారా? నోరు ఉంది కధా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి.


  అంటూ అందరూ తగువులాడుకుంటుంటే కావ్య కల్పించుకుని నేను ఆఫీసుకు వెళ్లడానికి పర్మిషన్‌ అడిగాను అంతే కానీ నేను వెళ్తున్నాను అని అనడం లేదు అంటుంది కావ్య. ఒక్కసారి వద్దని చెప్పాకా మళ్లీ వెళ్లమని ఎలా చెప్తుంది. అయినా నీకు వంటిళ్లే కరెక్టు అంటుంది ధాన్యలక్ష్మీ ఇంతలో సీరియస్‌గా నా కోడలు ఎక్కడుండాలో డిసైడ్‌ చేయడానికి నువ్వెవరు. నా కోడలు వండి తగలెయ్యడానికి వంట మనిషిలా కనిపిస్తుందా? అంటూ కావ్యను నువ్వు ఆఫీసుకు వెళ్లు అంటూ కావ్య వేసిన డిజైన్స్‌ వల్ల మనకు ఎంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందో తెలసా? మీకు అంటుంది. దీంతో కావ్య, కళ్యాణ్‌ చాలా హ్యాపీగా ఫీలవుతారు. అనామిక, రుద్రాణి షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ డైనింగ్‌ టేబుల్‌ నుంచి లేచి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య బెడ్‌రూంలోకి వచ్చి రెడీ అవుతున్న రాజ్‌తో మీ జడ్జిమెంట్‌ మీద నమ్మకం ఉందా అని అడుగుతుంది. ఎందుకని రాజ్ అడగ్గానే నేను ఆఫీసుకు  వస్తున్నానని అందుకోసం అత్తయ్య దగ్గర పర్మిషన్‌ తీసుకున్నాను అని చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. నేను ఒప్పుకోను అంటాడు. అయినా రాత్రి నువ్వు కల గని ఉంటావు. అనగానే మీకు కూడా అత్తయ్య గారితో చెప్పిస్తాను అంటుంది కావ్య. రాజ్‌ కిందికి వస్తూ ఈ అత్తాకోడళ్లు కలవడం ఏంటో అని  ఆలోచిస్తుంటే.. అపర్ణ ఎదురుగా వచ్చి నువ్వు ఒక్కడివే వస్తున్నావు నీ భార్య ఏది అని అడుగుతుంది. ఇంతలో కావ్య పైనుంచి నేను రెడీ అయ్యాను అత్తయ్యా అంటూ వస్తుంది.


అపర్ణ:  గుడ్‌ ఇలాంటి చీరలే కట్టాలి అప్పుడే మన ఇంటి గౌరవం పెరుగుతుంది. అయినా ఎందుకు ఇంత లేట్‌ అయ్యింది. ఆఫీసు పనులంటే ఇంటి పనుల్లా ఉండవు.. అన్నీ టైంకు జరగాలి.        


రాజ్‌: మమ్మీ ఏం జరుగుతుంది మమ్మీ.. అసలు ఏం జరుగుతుంది మమ్మీ ఈ కళావతి ఆఫీసుకు రావడం ఏంటి?


అపర్ణ: విధివశాత్తు ఒప్పుకోవడం జరిగింది నాన్నా. గుండె రాయి చేసుకొని ఉండు.


అనగానే కావ్యకు రాజ్‌ను ఊరికే కంగారుపెట్టకు అని చెప్పగానే రాజ్‌, కావ్య ఇద్దరూ బయటకు వెళ్తారు. రాజ్‌ కోసంగా నేను నిన్ను కారులో తీసుకెళ్లను అని చెప్పి ఒక్కడే వెళ్లిపోతాడు. కావ్య కోపంగా చూస్తూ.. నెనెప్పుడూ ఆఫీసుకు వెళ్లిన కాదు అనే వ్యక్తి ఇవాళ నన్ను ఆఫీసుకు తీసుకెళ్లకుండా వెళ్లాడంటే నా అనుమానమే నిజమవుతుందా? అని మనసులో అనుకుంటుంది కావ్య. మరోవైపు రూంలో కవితలు రాస్తూ కూర్చున్న కళ్యాణ్‌ దగ్గరకు అనామిక వస్తుంది. ఏం చేస్తున్నావు కళ్యాణ్‌ అని అడుగుతుంది. కళ్యాణ్‌ పలకడు అనామిక సీరియస్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: 23 ఏళ్లకే పెళ్లి - 30 ఏళ్లకు ఇద్దరు పిల్లలు కావాలనుకున్న సాయిపల్లవి, కానీ..!