Naga Panchami Today Episode: పంచమి, ఫణేంద్రలు కరాళి ఆశ్రమానికి వస్తారు. ఇక అక్కడే పంచమి పాముగా మారి నంబూద్రీని కాటేయడం, కరాళితో పెట్టుకున్న గొడవ అన్ని గుర్తు చేసుకుంటుంది. కరాళి నాగమణిని దక్కించుకుంటానని చేసిన సవాలు తలచుకుంటుంది.


ఫణేంద్ర: ఏం ఆలోచిస్తున్నావ్ పంచమి. 
పంచమి: ఈ ఆశ్రమంతో నా శత్రుత్వం ఈ నాటిది కాదు ఫణేంద్ర. నా కన్న తల్లి మరణం దగ్గర నుంచి నంబూద్రీ చనిపోయి ఆ స్థానంలో అతని చెల్లెలు కరాళి చేరిననాటిది. కరాళి మహా మంత్రగత్తే. నను పెంచి తండ్రిని రాళ్లుగా మార్చి ఎక్కడో దాచింది.
ఫణేంద్ర: అయితే ఆ కరాళిని మనం వదల కూడదు. సర్వ నాశనం చేయాలి.
పంచమి: అది అంత సులభం కాదు ఫణేంద్ర నన్ను మోక్ష బాబుని ముప్పు తిప్పలు పెట్టింది.
ఫణేంద్ర: మేఘనను పట్టుకొని బెధిరిస్తే కరాళి గురించి తెలుస్తుంది.
పంచమి: కరాళి తన వశీకరణ శక్తితో అంతా మర్చిపోయేలా చేయగలదు. మేఘన నాగకన్య అని తెలిసుకొని మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా తనని మా ఇంట్లో వదిలింది. ఎలా అయినా మోక్ష బాబుని నాకు దూరం చేసి తను వశీకరణ చేసుకోవాలి అని అనుకుంటుంది. తనని ఎలా అయినా అడ్డుకోవాలి. 
ఫణేంద్ర: అందుకు ఒక్కటే మార్గం మనం మేఘనను కనిపెట్టుకొని ఉండటం. 
పంచమి: నాగలోకం వెళ్లి నాగచంద్రకాంత మొక్కని కూడా కరాళినే తెచ్చి ఉంటుంది. పావుగా మేఘనని వాడుకుంది. నేను కరాళి చేతి నుంచి మోక్షని కాపాడాలి.
ఫణేంద్ర: ఎలా అయినా పర్లేదు పంచమి మన శత్రువు కరాళి తనని గుర్తించాలి.


వైదేహి: భయంగా ఉంది అత్తయ్య మళ్లీ మోక్ష జీవితం ఏమైపోతుందా అని భయంగా ఉంది. పంచమికి ఇచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాం. వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి. 
శబరి: పంచమి విషయంలో మోక్ష చాలా గట్టిగా ఉన్నాడు వైదేహి. వాళ్లని విడదీయడం చాలా కష్టం. అప్పుడు మోక్ష ఎటూ కాకుండా అయిపోతాడు. మన వంశంలో నాగగండం నుంచి బయట పడింది ఒక్క మోక్షనే. అది పంచమి చేసుకున్న పుణ్యం వల్ల అని నేను గట్టిగా నమ్ముతున్నా. పంచమి తాళి బొట్టే మోక్షని కాపాడింది.
వైదేహి: ఇక పంచమి మాట ఈ ఇంట్లో వినపడకూడదు. నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. మోక్ష.. మోక్ష నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను.  మీ డాడీ ఫారిన్ నుంచి రాగానే నీకు పెళ్లి జరుగుతుంది. నువ్వు సిద్ధంగా ఉండు.
మోక్ష: అమ్మ నీకు అంత శ్రమ అవసరం లేదు. నేను ఫారిన్ వెళ్లి పోతాను. నేను మళ్లీ తిరిగి వస్తే అప్పుడు ఆలోచిద్దాం.
వైదేహి: ఆగు మోక్ష. నా మాట విను. లేకపోతే ఈ ఇంట్లో నా శవం ఉంటుంది. నా దహన సంస్కారాలు అన్నీ పూర్తి అయిన తర్వాత వెళ్లు. మళ్లీ నువ్వు తిరిగి వచ్చినా రాకపోయినా చూడటానికి నేను ఉండను కాబట్టి ఏం జరిగినా నాకు పర్లేదు.  నీకు వేరే పెళ్లి చేస్తాను అంటే మీ డాడీ కూడా ఓకే అన్నారు.
మోక్ష: అమ్మా ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే చెప్తాను పంచమి లేకుండా నేను ఉండలేను. 
వైదేహి: ఇంకో అమ్మాయిని నేను వెతికి నీకు పెళ్లి చేస్తాను మోక్ష అంతే కానీ పంచమి ఈ ఇంటికి రావడం జరగదు. 
మోక్ష: మీకు ఇష్టం లేకపోతే పంచమి నేను ఎక్కడికైనా వెళ్లిపోతాం. 
వైదేహి: నీ ఇష్టం మోక్ష నేను చనిపోయిన తర్వాత నువ్వు ఏం అయినా చేసుకో. పెళ్లి కూడా పది పదిహేను రోజుల్లోనే అవ్వాలి. 
మేఘన: మనసులో.. చూస్తుంటే మోక్షని ఎవర్నో తెచ్చి పెట్టి పెళ్లి చేసేలా ఉందే. మోక్ష చేయి జారకుండా చూసుకోవాలి.
మోక్ష: తొందర పడకు అమ్మా తర్వాత నువ్వే నిరాశ పడతావ్.


ఫణేంద్ర: పంచమి ఇక ఆలస్యం చేయడం అనవసరం నేను వెంటనే నాగ దేవతను ప్రసన్నం చేసుకొని ప్రత్యక్షం చేసుకుంటాను మనం నాగలోకం వెళ్లిపోదాం పంచమి.
పంచమి: ఆగు ఫణేంద్ర. నాగలోకం రావడానికి నేను సిద్ధంగా లేను.
ఫణేంద్ర: నువ్వు మాట తప్పుతున్నావు పంచమి. మోక్ష ప్రాణాలతో బయట పడగానే నాగలోకం వస్తాను అని మాటిచ్చావ్. నువ్వు అనుకున్నది జరిగిపోయింది. మోక్ష ప్రాణాలతో ఉన్నాడు.
పంచమి: కానీ ప్రమాదంలో ఉన్నారు ఫణేంద్ర. కరాళి నాగగండం కంటే ప్రమాదమైంది. అలా మోక్ష బాబుని తనకు వదిలేసి నేను నాగలోకం రాలేను. అప్పుడు నా త్యాగానికి అర్థం ఉండదు. 
ఫణేంద్ర: ఇక మోక్ష గురించి నీకు అనవసరం.
పంచమి: అవసరమే ఫణేంద్ర మోక్షబాబుని ప్రమాదంలో వదిలేసి నేను రాలేను. 
ఫణేంద్ర: నువ్వు నాతో వస్తాను అంటేనే నేను అన్ని ఆంక్షలు తప్పి మోక్షని బతికించడానికి సాయపడ్డాను.
పంచమి: నిన్ను ఏమార్చి మంత్రం చెప్పించుకుంది అంటే మేఘన ఎలాంటిదో అర్థం చేసుకో. నన్ను నిన్ను నాగలోకానికి కూడా మోసం చేసింది. అలాంటిది మోక్షని ప్రాణాలతో వదలదు.
ఫణేంద్ర: నువ్వు ఇలాంటి మెలక పెడతావు అని తెలిస్తే నేను మోక్షని కాటేసి చంపి నాగలోకం వెళ్లిపోయేవాడిని.
పంచమి: మనం ఇప్పుడే వెళ్లి పోతే మోక్షాబాబుని కరాళి అనే మృత్యువు చేతిలో పెట్టి వెళ్లినట్లు అవుతుంది. నేను రాను ఫణేంద్ర. కరాళి అంతు చూసి మోక్ష బాబు ఒకఇంటి వాడు అయి సంతోషంగా ఉండటం తర్వాతే వస్తాను.
ఫణేంద్ర: పంచమి లేకుండా నేను ఒంటరిగా నాగలోకం వెళ్లకూడదు. ఆలస్యం అయినా సరే తనని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలి. సరే పంచమి ఇప్పుడు ఏం చేద్దాం. 
పంచమి: కరాళి శక్తుయుక్తులు నాకు బాగా తెలుసు. 
ఫణేంద్ర: చెప్పు పంచమి నేను నీకు సాయం చేస్తాను. 
పంచమి: కరాళి ఆచూకి కనిపెట్టి తన అంతు చూడాలి. సమయం చూసి మనం పట్నం వెళ్దాం. 


వేరే ఆడవాళ్లు అటుగా వచ్చి పంచమి వేరు అబ్బాయితో మాట్లాడుతుంది అని అనుకుంటారు. ఇక నా వల్ల నీకు కష్టాలు రాకూడదు అని ఫణేంద్ర నాగసాధువు దగ్గరకు వెళ్తానని వెళ్లిపోతాడు. మరో వైపు జ్వాలలో ఏదో శక్తి దూరం భూతంలా మారుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్ జనవరి 27th: భర్త ప్రాణాలతో చెలగాటమాడుతున్న మంగళ.. నిజం చెప్పేస్తానంటూ అమర్ దగ్గరికి వెళ్లిన మిస్సమ్మ!