Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అమర్ మిస్సమ్మకి థాంక్స్ చెప్తాడు. నువ్వే గనుక అమ్ముని మోటివేట్ చేసి ఉండకపోతే తను గెలిచి ఉండేది కాదు అంటాడు.


మిస్సమ్మ : మీరు మరీ ఎక్కువగా పొగడేస్తున్నారు సార్,ఏవో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పాను అంటుంది.


అమ్ము : లేదు మిస్సమ్మ నువ్వు ఇచ్చిన మోటివేషన్ తోనే నేను అక్కడ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాను అని థాంక్స్ చెప్తుంది.


అంజు: దీని అంతటికి కారణమైన నన్ను మర్చిపోతున్నారు అందరూ నాకు థాంక్స్ చెప్పండి అంటుంది.


నిర్మలమ్మ: ఈ ఇంట్లో ఏం జరిగినా అన్ని నీవల్లేనే గడుగ్గాయి. అయినా నువ్వే కదా మమ్మల్ని ఇంత భయపెట్టింది అంటూ అంజుని పట్టుకొని ముద్దులాడుతుంది.


అందరూ నవ్వుకుంటూ ఉంటారు అంతలోనే అక్కడికి వచ్చిన మనోహరితో అమ్ము గెలిచింది అని ఆనందంగా చెప్తుంది నిర్మలమ్మ.


మనోహరి : కానీ నా ఫ్రెండ్ ఓడిపోయింది తనని కొంచెం కొంచెంగా అందరం మర్చిపోతున్నాము అని దొంగ కన్నీరు పెడుతుంది. ఏమైంది అని అమర్ అడిగితే తన అస్తికలని గంగలో కలవలేదు. కలిపితేనే కదా ఆమె ఆత్మకు శాంతి అంటుంది.


నిర్మలమ్మ : అవున్రా ఈ హడావిడిలో పడే ఆ పని మర్చిపోయాము అంటుంది.


అమర్: మంచి రోజు చూడమ్మా అస్తికలు గంగలో కలిపేద్దాం అని చెప్తాడు.


ఆ మాటలు వింటున్న అరుంధతి బాధపడుతుంది. నాకు ఇలా ఉండటమే ఇష్టం అంటుంది.


మరోవైపు ఇంటికి వచ్చిన భర్తని కాఫీ తాగుతావా అని అడుగుతుంది మంగళ.


రామ్మూర్తి : ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి మంచి మాట వచ్చింది. కాఫీ ఇవ్వు అంటాడు.


మంగళ: కాఫీలో పసరు మంది కలిపి ఇస్తుంది.


అది చూసి బాగా టెన్షన్ పడతాడు కాళీ.


రామ్మూర్తి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వటానికి బయటకు వెళ్తాడు.


కాళీ: మంగళతో మనం తప్పు చేస్తున్నామేమో, ఆ మనోహరిని నమ్మి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నామేమో అంటాడు.


మంగళ :తప్పులేదు మనం ఎన్నాళ్ళని కష్టపడితే 50 లక్షలు సంపాదించగలం. ఇప్పుడు మీ బావకి కాలు, చెయ్యి పడిపోవచ్చు పోతే ప్రాణం కూడా పోవచ్చు అంటుంది.


మరోవైపు బాధతో కూర్చున్న అరుంధతి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు చిత్రగుప్తుడు.


అరుంధతి: జరిగిందంతా చెప్తుంది. అస్తికలు గంగలో కలపడం మంచిదేనా అని అడుగుతుంది.


చిత్రగుప్తుడు: నాకు మంచిది, అస్తికలు గంగలో కలిపిన వెంటనే నీ అస్తిత్వం కోల్పోయి పై లోకానికి వచ్చెదవు అంటాడు.


అరుంధతి: లేదు నేను రాను నా పిల్లల సుఖసంతోషాలు చూసుకోవాలి అంటుంది.


చిత్రగుప్తుడు: మనిషికి ఆశ ఎప్పటికీ చావదు. నువ్వు నీ పిల్లలు సుఖ సంతోషాలు చూసుకుంటావు కానీ వాళ్ళకి నీ బాధ ఎప్పటికీ తెలియదు. నువ్వు పరలోక ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


మరోవైపు మిస్సమ్మ అమర్ దగ్గరికి వెళుతుంది దారిలో రాథోడ్ కనపడతాడు.


రాథోడ్: ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.


మిస్సమ్మ : సార్ తో మాట్లాడాలి అంటుంది.


రాథోడ్: మీ నాన్న గురించేనా అంటాడు.


మిస్సమ్మ : అవును, దాంతోపాటు ఆరోజు మా ఇంటికి వచ్చింది పిన్ని, మావయ్య అని కూడా సార్ కి చెప్పేస్తాను లేదంటే మోసం చేసిన దాన్ని అవుతాను అంటుంది.


రాథోడ్: ఇప్పుడు చెప్పడం అవసరమా అంటాడు.


మిస్సమ్మ: నేను చెప్పేస్తాను లేదంటే మోసం చేసినట్లుగా అనిపిస్తుంది అంటుంది. నేరుగా అమర్ దగ్గరికి వెళ్లి సార్ మీతో మాట్లాడాలి అంటుంది.


అమర్ : ఎప్పుడూ నాతో ఏదో చెప్పాలనుకుంటావు కానీ చెప్పడం కుదరదు అది ఏంటో చెప్పు అంటాడు.


ఇంతలో ఫోన్ మీద ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి బయటకు వస్తుంది మిస్సమ్మ. మీ నాన్నకి బాగోలేదు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి పోతున్నాను నువ్వు హాస్పిటల్ కి వచ్చేయ్ అని మంగళ చెప్పడంతో హాస్పిటల్ పరిగెడుతుంది.


మనోహరి : భోజనానికి రమ్మని అమర్ ని పిలుస్తుంది.


అమర్: మిస్సమ్మ ఏది అని అడుగుతాడు. మనోహరి తెలియదు అనటంతో అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ని అడుగుతాడు.


రాథోడ్: మీ దగ్గరికి వచ్చింది కదా సార్ అని చెప్తాడు.


అమర్: నిజమే కానీ ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళింది మళ్ళీ తిరిగి రాలేదు అంటాడు.


మనోహరి : ఫోన్ వచ్చిందా అని ఆనందంగా అడుగుతుంది.


అమర్: అదేంటి అలా అడుగుతున్నావ్ ఆ ఫోన్ వస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు


మనోహరి :అలా ఏం లేదు క్యాజువల్ గా అడిగాను అంతే అని తమాయించుకుంటుంది.


అమర్: తను ఏం మాట్లాడాలనుకుందో నీకు తెలుసా అని రాథోడ్ ని అడుగుతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.