Sai Pallavi Comments on Marriage: న్యాచులర్‌ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామరస్‌ పాత్రలకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే చేస్తు వస్తుంది. అలా సెలక్టివ్‌ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సాయి పల్లవికి సౌత్‌లో మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింది. ముఖ్యంగా ఆమె డాన్స్‌కే సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందనడంలో సందేహం లేదు. డాక్టర్‌ చదివిన సాయి పల్లవి సప్లిసిటీకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతుంటారు. ఆమె అంటే కుర్రకారు తెగ పడిచచ్చిపోతుంది. ఈ క్రమంలో పెళ్లి రూమార్స్‌లో సాయిపల్లవి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 


అప్పట్లో పెళ్లి ఎప్పుడు? అని సాయి పల్లవి తరచూ ప్రశ్నలు ఎదురయ్యేవి. మీడియా నుంచి కాదు ఫ్యాన్స్‌  నుంచి ఇదే ప్రశ్న. అందుకే సాయిపల్లవి వార్తలు ఎప్పుడు మీడియాలో హాట్‌టాపిక్‌యే అవుతుంటాయి. త్వరలోనే పెళ్లి కబురు చెబుతుందనుకున్నారు అంతా. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె చెల్లి పూజ పెళ్లికి రెడీ అయ్యింది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమె గతవారం అతడిని నిశ్చితార్థం చేసుకుంది. వీటికీ సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఫుల్‌ సందడి చేస్తున్నాయి. ఈ వేడుకలో సాయి పల్లవి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. చెల్లితో కలిసి డాన్స్‌ చేసింది.. ఎంగేజ్‌మెంట్‌ మొత్తం ఆమె పక్కనే ఉంది. అయితే ఈ ఫొటోలపై కొందరు ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  అక్క పెళ్లి కాకుండా చెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటనీ, ఇంతకి సాయి పల్లవి ఎప్పుడు గుడ్‌న్యూస్‌ చెబుతుందని అంటున్నారు. 


Also Read: రూపాయి రెమ్యునరేషన్‌ లేకుండా సినిమా చేయబోతున్న మహేష్‌! - అందుకేనా?


అందుకే పెళ్లి వాయిదా పడిందా?


మరికొందరైతే సాయి పల్లవి పెళ్లి చేసుకోదా? అందుకే ఆమె చెల్లి ఫస్ట్‌ పెళ్లి చేసుకుంటుందా? అని ఆందోళన చేందుతున్నారు. అంటే సాయిపల్లవికి పెళ్లిపై ఆసక్తి లేదా? అనే అనుమానాలు వ్యక్తి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు గతంలో సాయి పల్లవి పెళ్లిపై చేసిన కామెంట్స్‌ని గుర్తు చేస్తున్నారు.  ఓ ఇంటర్య్వూలో సాయి పల్లవికి పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె ఇలా స్పందించింది. "నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి గురించి ఆలోచించేదాన్ని. 23 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోవాలి.. ౩౦ ఏళ్లలోపు ఇద్దరు పిల్లలను కనాలని అనుకున్నాను. కానీ ఎంబీబీఎస్‌ చదివే రోజుల్లో నా నిర్ణయాలు, ఆలోచనాలు పూర్తిగా మారాయి.


ఒక్క కెరీర్‌ గురించే ఆలోచించడం మొదలు పెట్టాను. ఇక కుటుంబంలో నేను పెద్దదాన్ని కావడంలో కొన్ని కీలక బాధ్యతలు కూడా నా మీద పడ్డాయి. అందుకే అప్పట్లో పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇంట్లో వాళ్లు ప్రస్తావన తీసుకువచ్చినా వాటిని వాయిదా వేస్తూ వచ్చేదాన్ని. ఇక హీరోయిన్‌ అయ్యాక పెళ్లి ఇంకాస్త వాయిదా పడింది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రొఫెషనల్‌ లైఫ్‌ కారణంగానే పర్సనల్‌ లైఫ్‌పై సాయి పల్లవి పెద్దగా ఫోకస్‌ చేయలేదని, అందుకే ఆమె పెళ్లి ఆలస్యం అయ్యిందని తన కామెంట్స్‌తో అర్థమైంది. చెల్లి పెళ్లి తర్వాత అయినా ఈ బ్యూటీ పెళ్లి కబురు చెబుతుందా? ఇంకా ఆలస్యం చేస్తుందా? చూడాలి!