Shruti Haasan Birthday: టాలంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ బర్త్‌డే నేడు. జనవరి 28న ఆమె 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, తోటి నటీనటులు ఆమె స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆమె ఫొటో షేర్ చేసి మరి బర్త్‌డే విషెస్ తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ శృతి ఫొటో షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే @shrutzhaasan! ఈ ఏడాది మీ జీవితంలో మరింత సంతోషం, వెలుగు నిండాలని ఆశిస్తున్నా" అంటూ రాసుకొచ్చాడు. అలాగే యంగ్ హీరో అడవి శేష్ కూడా శృతికి స్పెషల్ విషెస్ తెలిపాడు.
ఈ సందర్భంగా తన స్పెషల్ లుక్ షేర్ చేస్తూ.. శృతిని విష్ చేశాడు.'డియర్ @shrutihaasan. ఇలాంటి బర్త్‌డేలు మరేన్నో జరుపుకోవాలి. హ్యాపీ బర్త్‌డే బ్యూటీఫుల్ సోల్. మీతో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మీరు మా అందరికీ చాలా స్పెషల్. #DACOIT లో మీతో కలిసి పనిచేసేందుకు చాలా ఆసక్తిగా వేయిట్ చేస్తున్నా" అంటూ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో వారి అప్‌కమ్మింగ్ మూవీపై కూడా అప్‌డేట్ ఇచ్చాడు. అతిత్వరలోనే ఈ మూవీని ప్రారంభించబోతున్నట్టు కిక్‌స్టార్ట్ అంటూ హింట్ ఇచేశాడు. ఇటీవలే సలార్‌తో సాలిడ్ హిట్ కొట్టింది. ఇందులో వేద పాత్రలో అలరించింది. ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
అడివి శేష్ - శృతిహాసన్ కలిసి ఈ సినిమా నటించబోతోంది. శేష్ ఎక్స్ శృతి (SeshEXShruti) అంటూ గతేడాది ఈసినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఆ మధ్య లవ్ బ్రేకప్ వల్ల సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం శాంతానుతో లవ్ లో ఉన్న ఆమె రీ ఎంట్రీలో మంచి హిట్స్ అందుకుంటుంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న శృతిహాసన్ రీసెంట్‌గా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలోనూ మెరిసింది. రీ ఎంట్రీలో స్టార్ హీరోలకే ఇంపార్టెన్స్ ఇచ్చిన శృతి.. ఇప్పుడు యంగ్ హీరో శేష్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమైంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించనుంది. ఏషియన్ సునీల్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. యువ కెమెరామ్యాన్ షానిల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతానికి మేకర్స్ ఈ వివరాలను మాత్రమే రివీల్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: మన్నారా చోప్రాతో గొడవపై ఎట్టకేలకు స్పందించిన శ్రద్ధా దాస్ - వైరల్ అవుతున్న పోస్ట్!