అఘోరగా విశ్వక్ సేన్ - భయపెడుతున్న ‘గామి’ ఫస్ట్ లుక్ 
మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కామెంట్స్‌, సినిమాలతో ఎప్పుడు కాంట్రవర్సల్‌ అవుతుంటాడు ఈ యంగ్‌ హీరో. వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో ఫ్యాన్స్‌ అలరించే ఈ మాస్‌ హీరో ఇప్పుడు ఓ థ్రిల్లర్‌ సినిమాతో రాబోతున్నాడు. అదే 'గామి'. దర్శకుడు విద్యాదర్ కగిట  ఈ చిత్రాన్ని అడ్వేంచర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్‌తోనే బజ్‌ క్రియేట చేసిన ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యి చాలా రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఫస్ట్‌లుక్‌ రాలేదు. ఈ క్రమంలో ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ చేశారు మేకర్స్‌. హైదరాబాద్‌లో జరుగుతున్న కామిక్‌ కాన్‌ మూవీ ఫెస్టివల్లో గామి ఫస్ట్‌లుక్‌ను లాంచ్‌ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మన్నారా చోప్రాతో గొడవపై ఎట్టకేలకు స్పందించిన శ్రద్ధా దాస్ - వైరల్ అవుతున్న పోస్ట్!
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ రోజుతో 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే... ఈసారి కప్ కొట్టే రేసులో చివరి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అవుతుంది. సీజన్ 17 లో మన్నారా తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుని ఫైనల్ 6లో చోటు సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మన్నారా చోప్రా నెగెటివ్ ట్రెండ్ ఎక్కువైంది. హీరోయిన్ శ్రద్ధాదాస్ మన్నారా పై చేసిన ఇందుకు కారణమని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓవర్సీస్‌లో 'హనుమాన్' ప్రభంజనం - 5 మిలియన్ల డాలర్స్ తో అరుదైన ఘనత!
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వెంకటేష్ మహా రిస్క్ తీసుకోలేదు, మేం తీసుకుంటున్నాం - నిర్మాత ధీరజ్ ధీరజ్ మొగిలినేని
సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘దొరసాని‘, ‘ఏబీసీడీ‘, ‘ఊర్వశివో రాక్షసివో‘, ‘బేబి‘ లాంటి హిట్ చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కళాకారుల గొప్పదనాన్ని చాటి చెప్పే 'ఉత్సవం' - ఎమోషనల్‌గా సాగిన టీజర్ చూశారా?
కళాకారులు, నాటకాల నేపథ్యంలో దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, 'రచ్చ' రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఇటీవల విడుదల చేశారు. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)