Utsavam Teaser: కళాకారులు, నాటకాల నేపథ్యంలో దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, 'రచ్చ' రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఇటీవల విడుదల చేశారు. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు.


ఆకట్టుకున్న ఫస్ట్ లుక్


ఇటీవల రిలీజ్ చేసిన ఉత్సవం ఫస్ట్ లుక్ లో హీరో పాత్ర పోషించిన దిలీప్ ప్రకాష్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపించారు. తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు వున్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కళ పట్ల అతని అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ ఆహ్లాదకరంగా ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ని కలిగించింది. ది షో మస్ట్ గో ఆన్ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి పెంచింది.


ఎమోషనల్‌గా 'రిహార్సల్స్ ఆఫ్ ఉత్సవం'


ఉత్సవం టీజర్ విషయానికొస్తే... 'కళాకారుడు చనిపోవచ్చు కానీ కల చనిపోకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ బ్యాగ్రౌండ్ లో చెప్పే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. '15 ఏళ్ల అయింది రా పాత్ర వేసి... నుదుట బొట్టు పెట్టుకోగానే కన్నీటి బొట్టు ఆగలేదు' అంటూ ఎల్బీ శ్రీరామ్ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఆ తర్వాత సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్, రఘు బాబు, ఆమని, బ్రహ్మానందం, అలీ తదితరుల పాత్రలను చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య బాండింగ్ ఆకట్టుకుంది.


Also Read: ‘రామాయణ్‘లో హనుమంతుడిగా సన్నీడియోల్‌, రెమ్యునరేషన్ అన్ని కోట్లా?



ఇక టీజర్ లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. వీటన్నింటితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 'రంగస్థలం మీద ఎన్ని పాత్రలు వేసినా కష్టం అనిపించలేదు రా.. కానీ ఈ రెండు గంటల ఒక మనిషి పాత్ర చాలా కష్టం' అనిపిస్తుంది అంటూ ప్రకాష్ రాజ్ టీజర్ చివర్లో చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఆయన డైలాగ్ ని బట్టి సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అర్థమవుతుంది. మొత్తంగా 'ఉత్సవం' టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.


Also Read : హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏమిటో తెలుసా?