తెలుగు తెరపై కథానాయికగా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన, అంత కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శ్రీ లీల (Sreeleela). 'పెళ్లి సందడి' నుంచి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' వరకు ఆమె వరుస సినిమాలు చేశారు. మహేష్ బాబు సినిమా తర్వాత శ్రీ లీలకు అవకాశాలు రావడం కష్టమని కొందరు భావించారు. అయితే... అటువంటి అనుమానాలకు చెక్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలో ఆమె ఛాన్స్ అందుకున్నారని తెలిసింది.


ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీల?
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసేవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే. గత ఏడాది చివర్లో ఆయన హీరోగా నటించిన 'సలార్' థియేటర్లలోకి వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం నమోదు చేసింది. రూ. 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అది విడుదల అయ్యే సమయానికి ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ'. ఇంకొకటి... మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'రాజా సాబ్'. ఈ రెండు కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. 


ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. 'సీతా రామం' విజయం తర్వాత హను ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయన ఓ ప్రేమకథ రెడీ చేస్తున్నారు. అందులో కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల శ్రీ లీలను కలిసి కథ, ఆమె పాత్ర గురించి వివరించారట. అయితే... ఇంకా చర్చలు పూర్తి కాలేదు. సినిమాకు శ్రీ లీల సంతకం చేయలేదని తెలిసింది. ప్రభాస్ సినిమా అయితే ఎవరు 'నో' చెబుతారు? త్వరలో ఈ సినిమాలో శ్రీ లీల ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ALso Readగురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...


గత ఏడాది శ్రీ లీల నటించిన నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. 'ధమాకా' తర్వాత శ్రీ లీలకు సరైన హిట్ పడలేదు. ఒకవేళ హిట్ పడినా అందులో ఆమె క్యారెక్టర్ ఏముంది? అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు సైతం శ్రీ లీల వద్దంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.


Also Readనైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?


 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఆమె మెయిన్ హీరోయిన్. అయితే... ప్రస్తుతానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేయడంతో ఆ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారు. అది కాకుండా నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలో శ్రీ లీల నటిస్తున్నారు.రెమ్యూనరేషన్ గురించి మాత్రమే ఆలోచించడంతో సరైన క్యారెక్టర్లు రాక... వచ్చినవి ఫ్లాప్ కావడంతో శ్రీ లీల కెరీర్ మీద ఎఫెక్ట్ పడే స్థాయికి వచ్చింది.