పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'విశ్వంభర'. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే 2025 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. విశేషం ఏమిటంటే... ఏడాది క్రితం ఓవర్సీస్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్మేశారు.
చిరు కెరీర్‌లో హయ్యస్ట్ రేటుకు...
మెగాస్టార్ ఖాతాలో మరో రికార్డు!
'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు ఇచ్చినట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో రూ. 15 కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఇంత అమౌంట్ ఎవరికీ రాలేదు.
ఇది మెగాస్టార్ 156వ సినిమా. సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమాగా 'విశ్వంభర' రూపొందుతోంది. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమైన 'బింబిసార' కూడా ఆ తరహా చిత్రమే. ప్రస్తుతం ఓవర్సీస్ ఆడియన్స్ ఇటువంటి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 'హనుమాన్' అక్కడ 6 మిలియన్ డాలర్స్ రాబట్టింది. సో... ఫారిన్ డిస్ట్రిబ్యూటర్లు సినిమాకు మంచి రేటు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.
Also Read: అమెరికాలో తీసిన 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా
చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన ఆనందంలో ఉన్న అభిమానులకు... ఈ 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ మరో చిరు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.
'విశ్వంభర'లో రానా దగ్గుబాటి విలన్!?
'విశ్వంభర' సినిమాలో విలన్ పాత్రకు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటిని సంప్రదించారని టాక్. ఈ కథ, అందులో పాత్ర విన్న తర్వాత ఆయన కూడా ఓకే చెప్పారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో రానా నటించారు. ఇప్పుడు చిరు చిత్రంలో నటిస్తున్నారు.
Also Read: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...
రానా ఇతర సినిమాలకు వస్తే... తమిళంలో రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. మరోవైపు సోలో హీరోగా తేజ దర్శకత్వంలో 'రాక్షస రాజా' అనౌన్స్ చేశారు. అది కాకుండా ఒక మల్టీస్టారర్ సినిమా కూడా చర్చల్లో ఉందట.
Also Read: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.