గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు తమిళ దర్శకులతో పని చేయడం కొత్త కాదు. 'జై సింహా' చిత్రానికి కేఎస్ రవికుమార్ డైరెక్షన్ చేశారు. అంతకు ముందు కూడా తమిళ దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'లో ప్రత్యేక పాత్ర కోసం తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో వర్క్ చేస్తున్నారు. ఆ తరువాత మరో తమిళ దర్శకుడికి ఆయన అవకాశం ఇచ్చి ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ టాక్.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో బాలయ్య?కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కథానాయకుడిగా ఇటీవల విడుదల అయిన 'గుడ్ బాడ్ అగ్లీ' గుర్తు ఉందా? దానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. తమిళనాడులో ఈ సినిమా భారీ విజయం సాధించింది. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతకు ముందు విశాల్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'మార్క్ ఆంటోనీ'కి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా 100 కోట్ల క్లబ్బులో చేరింది.
ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ ప్రస్తావన ఎందుకంటే... అతని దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అవకాశాలు ఉన్నారని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బాలయ్యను కలిసిన దర్శకుడు ఒక కథ వినిపించారట. 'గుడ్ బాడ్ అగ్లీ' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాలకృష్ణతో నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వైకి మంచి అనుబంధం ఉంది. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' నిర్మించారు.
అధిక్ రవిచంద్రన్ చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలకృష్ణ దగ్గరకు అతడిని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు తీసుకు వెళ్లారట. ఇప్పటికీ అయితే బాలకృష్ణ స్టోరీ పాయింట్ మాత్రమే విన్నారట. ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఇండియన్ 2 ఫ్లాపైనా కమల్ క్రేజ్ తగ్గలే... నాన్ థియేట్రికల్ రైట్స్‌తో నిర్మాతల జేబులో 200 కోట్లు Balakrishna upcoming movies: ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక సినిమా అంగీకరించారు. 'వీర సింహారెడ్డి' వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడికి ఆయన మరొక ఛాన్స్ ఇచ్చారు. సోలో హీరోగా ఈ రెండు సినిమాలు కాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ లైన్ అప్ తర్వాత బాలకృష్ణతో అధిక్ రవిచంద్రన్ సినిమా ఉంటుంది.
Also Read: యూజర్లకు షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో... యాడ్స్ చూడక తప్పదు - వద్దంటే ఎక్స్ట్రా కట్టాలమ్మా