మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'విశ్వంభర'. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సింగిల్ 'రామ రామ' సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.
జై శ్రీరామ్... 25 ప్లస్ మిలియన్ వ్యూస్!'రామ రామ...' సాంగ్ చూస్తే... 'జై శ్రీ రామ్' నినాదం బలంగా ప్రతిధ్వనించింది. ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో 25 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించింది. అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ అవుతోంది.
Also Read: ఇండియన్ 2 ఫ్లాపైనా కమల్ క్రేజ్ తగ్గలే... నాన్ థియేట్రికల్ రైట్స్‌తో నిర్మాతల జేబులో 200 కోట్లు
చిరంజీవి అంటే డ్యాన్స్, గ్రేస్. మెగాస్టార్ చిరంజీవి డాన్స్‌తో పాటు గ్రేస్ కలవడం, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం, 'సరస్వతీపుత్ర' రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం కలిపి పాటను మరింత పెద్ద హిట్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా... బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్.
Also Read: యూజర్లకు షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో... యాడ్స్ చూడక తప్పదు - వద్దంటే ఎక్స్ట్రా కట్టాలమ్మా