Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర జీవితం నాశనం చేసేశావని యమున కొడుకుని తిడుతుంది. నువ్వు మాట ఇవ్వడం వల్లే కదా సహస్ర నిన్ను ప్రేమించింది.. వాళ్లు మన ఇంటికి వచ్చారని అంటుంది. మీ అత్తయ్య మనోవేదన నాకు తెలుస్తుంది. వాళ్లు మనల్ని అడిగిన అన్ని ప్రశ్నలు కరెక్టేరా.. ఇన్నాళ్లు నా కొడుకు మంచోడు అనుకున్నా కానీ ఇప్పుడు ఒపీనియన్ మారిపోయింది. ఎందుకంటే ఒక మంచి అమ్మాయి అమాయకురాలిని ప్రేమ పేరుతో నమ్మించి చావు అంచుల వరకు తీసుకెళ్లావ్ ఆ ఉసురు మనకు తగులుతుందిరా అని యమున కొడుకుని తిడుతుంది.
పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వస్తుంది. సహస్రలో ఏ మార్పు లేదు.. ఆరిపోయే ముందు దీపం వెలుగు ఎక్కువ వచ్చినట్లు సహస్ర స్ఫ్రుహాలోకి వచ్చిందని ఇదే చివరి ఊపిరి అయింటుందని అంటుంది. ఇలా చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఆమెకు ఏమైనా ఆఖరి కోరిక ఉంటే తీర్చేయండి అని చెప్తుంది. అందరూ గట్టిగా ఏడుస్తారు. తర్వాత సహస్రని చూడటానికి పరుగులు తీస్తారు. సహస్రని చూసి ఏడుస్తారు. అందరూ సహస్రని పిలుస్తారు. సహస్ర మెల్లగా కళ్లు తెరుస్తుంది. కళ్లు తెరవడం తెరవడమే బావ బావ అని పిలుస్తుంది. ఇంకా ఎందుకే వాడి పేరు తలచుకుంటావ్ నీ పరిస్థితికి వాడే కారణం కదా అని పద్మాక్షి అంటుంది.
యమున ఏడుస్తూ సహస్ర పిలుస్తుంది చూడు విహారి అంటుంది. విహారి సహస్రకు సారీ చెప్తాడు. సహస్ర బావ బావ తాళి.. బావ తాళి అని మాస్క్ తీసి ఇబ్బంది పడుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి పేషెంట్ ఏం అడుగుతున్నారో నాకు తెలుసు మేడం అని అంటుంది. ఏంటి అని యమున అడిగితే దానికి డాక్టర్ తాళి అని చెప్తుంది. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత ఈ తాళి గట్టిగా పట్టుకొని ఉందని అంటుంది. సహస్ర తాళి తీసుకొని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుంది. అంబిక అందరితో విహారి తన మెడలో తాళి కట్టాలంట అని అంటుంది అంబిక. విహారి నీకు ఆ తాళి కట్టకే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటుంది. విహారి తాళి చూసి వెళ్లిపోతుంటే యమున ఆపి నిన్ను కొడుకుగా ఆడగటం లేదు.. కేవలం ఓ ఆడదానిలా అడుగుతున్నా.. తనకు తాళి కట్టరా. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుంది. నీకు సమస్య ఏమైనా ఎంత పెద్దది అయినా నాకు అవసరం లేదు సహస్ర మెడలో తాళి కట్టరా అని చెప్తుంది. విహారి కదలకపోతే సహస్ర మెడలో తాళి కట్టరా అని యమున అరుస్తుంది. పద్మాక్షి దాని చివరి కోరిక తీర్చరా అని అంటుంది. లక్ష్మీ తాళి కట్టమని తలూపుతుంది.
యమున తాళి ఇచ్చి కట్టరా అని చెప్పడంతో విహారి సహస్ర మెడలో తాళి కట్టేస్తాడు. తర్వాత సహస్ర ఊపిరి తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు నటిస్తుంది. డాక్టర్ అందర్ని బయటకు వెళ్లమని చెప్తుంది. అందరూ బయటకు వెళ్లిపోతారు. ఇంతలో డాక్టర్ వచ్చి చిన్న పాజిటివ్ మూమెంట్ అండీ ఇంత వరకు ట్రీట్మెంట్‌కు స్పందించని బాడీ ఇప్పుడే స్పందించిందని అంటుంది. విహారి తాళి కట్టడం వల్లే ఇదంతా అని అందరూ అంటారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు అని పద్మాక్షి అంటుంది. ఇలాంటి కేసుల్ని పరిశీలించడానికి ఓ స్పెషలిస్ట్ వచ్చారని ట్రీట్మెంట్ చేస్తున్నారని అంటారు. సహస్ర డాక్టర్‌తో ఇక్కడి నుంచి రెండు గంటలు తర్వాత మనం అనుకున్నది జరిగితే నా జీవితం సక్సెస్ నేను మీ జీవితం సక్సెస్ చేస్తా అంటుంది.
డాక్టర్ బయటకు వెళ్లి రెండు గంట్లో ఆపరేషన్ ఉంది ఆపరేషన్ సక్సెస్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటుంది. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది సహస్ర బతికిందని చెప్తుంది. అందరూ సంతోషిస్తారు. విహారి మాత్రం షాక్ అయిపోతాడు. సహస్ర చివరి కోరిక తీరడం వల్లే బతికిందని డాక్టర్ అంటారు. అందరూ సహస్ర దగ్గరకు వెళ్తారు. మృత్యువుని జయించావు సహస్ర అని అంటారు. అందరితో సహస్ర మాట్లాడుతుంది. బావ అని విహారిని పిలుస్తుంది. విహారి చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. నా మెడలో తాళి కట్టి నాకు జీవితంతో పాటు పునర్జన్మ కూడా ఇచ్చావని అంటుంది. డాక్టర్ అందర్నీ బయటకు పంపిస్తుంది.
సహస్ర పూర్తిగా కోలుకున్న తర్వాత అందరూ సహస్రని తీసుకొని ఇంటికి వస్తారు. యమున విహారితో సహస్ర చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లమని అంటారు. యమున ఇద్దరినీ గుమ్మం ముందు ఆపి పండుకి ఎర్ర నీళ్లు తీసుకురమ్మని చెప్తుంది. వసుధకు దిష్టి తీయమని పద్మాక్షి అంటే పిన్నిని ఆపి లక్ష్మీని తీయమని అంటుంది. పనివాళ్లే తీయాలి కదా అని అంబిక చెప్తుంది. లక్ష్మీ వెళ్లి ఇద్దరికీ దిష్టి తీస్తుంది. ఇద్దరికీ బొట్టు పెడుతుంది. పద్మాక్షి అందరితో నా ఇంటికే నా కూతురు కోడలు అయింది అంత ఈజీగా తీసుకెళ్లిపోతారా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!