Nindu Noorella Saavasam Serial Today Episode: వినోద్ దగ్గరకు వెళ్లిన భాగీ వెనకాలే అనామిక వెళ్లుంది. భాగీ రావడం గమనించిన మనోహరి ఆరు ఫోటోకు అడ్డంగా నిలబడుతుంది. వెనక నుంచి వచ్చి చూసిన అనామిక రిలాక్స్ అవుతుంది.
భాగీ: హాయ్ వినోద్ ఎలా ఉన్నావు..?
వినోద్: బాగానే.. ఉన్నాను..
మనోహరి: ఏంటి వినోద్ అలా పట్టిపట్టనట్టు మాట్లాడుతున్నావు. తను మీ వదినే కదా బాగా మాట్లాడు..
వినోద్: నా వరకు నాకు ఒక్కరే వదిన ఉన్నారు. మీరు ఈ ఇంటి కోడలు.. మా అన్నయ్య భార్య అయ్యుండొచ్చు.. కానీ నా వరకు మీరు నాకు పరాయి వాళ్లే కాబట్టి మా వదిన స్థానాన్ని వేరొకరికి ఇవ్వలేను.
వినోద్ వెళ్లిపోతాడు.
మనోహరి: ఏంటి బాగీ పాపం నువ్వేంటో ప్రేమగా పలకరించడానికి వస్తే తనేంటి అలా మాట్లాడిపోయాడు. నిన్ను చూస్తుంటే.. బాధేస్తుంది.. ఏమిటో అమర్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనఃశాంతి లేకుండా పోతుంది. ఫస్ట్ అమర్,తర్వాత పిల్లలు అందరినీ నీ వైపు తిప్పుకున్నావు.. ఇంతలో వినోద్ వచ్చి కథ మొత్తం మొదటికి తీసుకెళ్లాడు..
భాగీ: ఏంటి మను వినోద్ బాధను అవకాశంగా తీసుకుందామనుకుంటున్నావా..? ఆయన నీ మాట వినాలి అంటే నువ్వు మోసం చేయాలి. కానీ నేను నాలా ఉంటే చాలు నన్ను ఇష్టపడతారు.. అర్థం చేసుకుంటారు. అయినా నువ్వు బాధపడాల్సింది నా గురించి కాదు. నీ గురించి నీకు అర్థం అవుతుందో లేదో అబద్దాలతో నువ్వు కట్టిన కోట కూలిపోతుంది. నీ నిజ స్వరూపం ఆయనకు తెలిసిపోతుంది. జాగ్రత్త..
అంటూ భాగీ వార్నింగ్ ఇచ్చి వెల్లిపోతుంది. పైన రూంలో అమర్ బట్టలు సర్దుకుంటుంటే రాథోడ్ వస్తాడు.
రాథోడ్: సార్ ఫ్లైట్ కు టైం అవుతుంది.
అమర్: రెండు నిమిషాలు రాథోడ్.. ఇంట్లో ఎవరు అడిగినా మనం ఢిల్లీ వెళ్తున్నాం అని చెప్పు.. గుర్తుంది కదా
రాథోడ్: గుర్తుంది సార్
అని లగేజీ తీసుకుని కిందకు వెల్తాడు రాథోడ్.
నిర్మల: రాథోడ్ ఈ లగేజీ ఎక్కడిది..
రాథోడ్: సార్ ది మేడం
శివరాం: అమర్ దా..? ఎక్కడికైనా వెళ్తున్నాడా..?
నిర్మల: ఇంత సడెన్‌గా ప్రయాణం ఏంటి రాథోడ్ ఎక్కడికి వెళ్తున్నాడు
రాథోడ్: ఏమో నాకు తెలియదు మేడం
అమర్ కిందకు వస్తాడు.
శివరాం: అమర్ ఏంటి ఎక్కడికో వెళ్తున్నావు అంట ఎక్కడికి వెళ్తున్నావు
అమర్: చిన్న పనుంది నాన్న రేపు ఈవినింగ్‌కు వచ్చేస్తాను
మనోహరి: పొద్దున్నే నా గురించి అడిగాడు. ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అంటున్నాడు నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడా..? అమర్‌ను అనుమానం దగ్గరే ఆపేయాలి.. ఆధారాల దాకా వెళ్లనివ్వకూడదు. (మనుసులో అనుకుంటుంది.)
శివరాం: రేపు ఈవెనింగ్ వస్తావా..? ఏ ఊరికి వెళ్తున్నావు అమర్
అమర్: ఢిల్లీ నాన్నా చిన్న మీటింగ్ ఉంది.
మనోహరి తన గురించి కాదని రిలాక్స్ అవుతుంది.
భాగీ: అదేంటండి వినోద్ ఇప్పుడే వచ్చారు..మీరేమో ఢిల్లీ వెళ్తున్నారు. మీటింగ్ రెండు రోజులు పోస్ట్ పోన్ చేయకూడదా..?
అమర్: లేదు భాగీ వెంటనే వెళ్లాలి ఇప్పటికే చాలా లేట్ అయింది
వినోద్: ఏమైంది అన్నయ్యా ఏదైనా కొత్త అసైన్‌మెంట్ ఇచ్చారా..?
అమర్: అసైన్‌మెంట్ లాంటిదే వినోద్ కాకపోతే కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నాను. కొన్నేళ్ల ముందు మొదలు పెట్టి కొన్ని కారణల వల్ల ఆపేశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. నా చుట్టు ఉన్న చాలా సమస్యలకు సమాధానం ఆ అసైన్ మెంట్‌ను ఫినిష్ చేస్తే సాల్వ్ అవుతాయని నమ్ముతున్నాను అందుకే అర్జెంట్‌గా వెళ్తున్నాను
భాగీ: ఏవండి మీరు చెప్తుంటే అదేదో చాలా ప్రమాదకరంగా అనిపిస్తుందండి.. మీరు తప్పకుండా వెళ్లాలా..?
అమర్: నాకు ముఖ్యమైనవి కాపాడుకోవాలి అనుకుంటే నేను కచ్చితంగా వెళ్లాలి భాగీ. ఇప్పుడు కూడా నేను వెళ్లకుంటే.. అసైన్‌మెంట్ కంప్లీట్ చేయకుంటే ఇక ఎప్పటికీ నా మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు నాకేం కాదు
అంటూ అమర్ వెల్లిపోతాడు. కోల్ కతా వెల్లిన అమర్ మనోహరి ఉన్న ఆశ్రమానికి వెళ్లి రణవీర్‌కు మనోహరికి పెళ్లి అయిందన్న నిజం తెలుసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా అమర్ రణవీర్ ఇంటికి వెళ్తాడు. అమర్‌ను చూసిన రణవీర్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!