Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవాలతో పాటు ఇంటిళ్లపాదిని కూర్చొపెట్టిన బేబీ బామ్మ వాళ్ల లవ్ స్టోరీ చేయమని అడుగుతుంది. అందరూ మిథున ఏం చెప్తుంది అని కంగారు పడతారు. మిథున తడబడుతుంటే రంగం భర్తతో చచ్చింది గొర్రె ఇక బయటకు వెళ్లిపోవడమే అని అనుకుంటారు. మిథున భర్తతో ఏవండోయ్ శ్రీవారు మన పరిచయం ప్రేమ పెళ్లి అడుగుతున్నారు చెప్పేస్తున్నా అని అంటుంది.
మిథున బామ్మతో మా ఇద్దరిదీ ఒకే కాలేజ్ అని చెప్తారు. ఇద్దరికీ పడదు అని తన ఫ్రెండ్స్‌ని ప్రేమని గెలిపించాలి అని మేం ఇద్దరం అగ్రిమెంట్‌కి వచ్చామని వాళ్ల ప్రేమని గెలిపించే పనిలో మేం ప్రేమలో పడిపోయాం అని ఖుషి సినిమా స్టోరీ చెప్పేస్తుంది. సూపర్ ట్విస్ట్‌లు అని బామ్మ పొంగిపోతుంది. ప్రేమ తర్వాత బొమ్మరిల్లు స్టోరీ చెప్పేస్తుంది. అపుడో ఇపుడో ఎపుడో అని నా కోసం లవ్ సాంగ్స్ పాడాడని బస్‌లో వెళ్తుంటే ఐలవ్‌యూ అని అరిచాడని దేవా వాళ్ల నాన్న చూసేశారని మొత్తం బొమ్మరిల్లు స్టోరీ చెప్తుంది. తన ఇంట్లో వాళ్లకి ప్రేమ విషయం తెలిసిపోవడంతో దేవా సైకిల్ మీద వచ్చి ఎవ్వరు ఏమన్నా ఆగదు నా ప్రేమ అని గుడిలోకి తీసుకెళ్లి తాళి కట్టాడని అంటుంది. బామ్మ సూపర్ అని పొగిడేస్తుంది.
రంగం మిథునతో నీ స్టోరీ సూపర్ అమ్మా నువ్వు నీ ప్రేమ కథ చెప్తుంటే మూడు సినిమాలు ఒకే సారి చూసినట్లు అనిపించిందని అంటాడు. ఇక కాంతం బేబీ మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా అంటే బేబి ఉందని అంటుంది. అయితే ఖుషి సినిమా చూశారా. బొమ్మరిల్లు చూశారా. జయం సినిమా చూశారా అంటే చూశాను అంటుంది. అయితే మీకేం అనిపించలేదా అని కాంతం అడుగుతుంది. తిక్క తిక్క ప్రశ్నలు వేస్తే కొడతా అని బామ్మ కాంతాన్ని తిడుతుంది.
మిథున మేడ మీద ముఖానికి గోరింటాకు చేతులు అడ్డుపెట్టుకుని ఉంటే ఏమైంది అని దేవా వెళ్లి ఏయ్ ఏం చేస్తున్నావ్ అంటాడు. దానికి మిథున తన చేతులతో చంద్రున్ని చూసి తర్వాత దేవాని కర్వాచౌత్‌లా చూస్తుంది. ఏంటి క్షుద్రపూజలు చేస్తున్నావా అని మిథున అంటే అవే వచ్చుంటే నీతో ఎప్పుడో మిథున నా భార్య అని చెప్పించేదాన్ని అంటుంది. మిథున దేవా దగ్గరే పడుకుంటే నువ్వేంటి ఇక్కడ పడుకున్నావ్ అని అడుగుతాడు. నేను ఇక్కడ పడుకోకపోతే మా బామ్మ నన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పాలి అని అడుగుతుంది. మా నాన్నమ్మని అడ్డుపెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అడుగుతాడు. బలవంతంగా మిథునని కిందకి పంపేస్తాడు.
మిథున వెళ్లి హాల్‌లో పడుకుంటుంది. రాత్రి మంచి నీరు తాగడానికి లేచిన బామ్మ మిథున హాల్‌లోపడుకోవడం చూస్తుంది. మిథునని లేపి ఇక్కడ పడుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది. మిథున కవర్ చేయాలి అని చూస్తే నువ్వేమైనా పని మనిషివా ఇంట్లో ఓ మూలకి పడుకున్నావ్. నీ భర్త పక్కన పడుకోలేదు ఏంటి అని అంటుంది. చల్లగాలి కోసం అని మిథున కవర్ చేస్తుంది. ఈ గదిలోకి ఎక్కడ నుంచి చల్లటి గాలి వస్తుందమ్మా కనీసం ఫ్యాన్ కూడా లేదు అని అంటుంది. నువ్వు అబద్ధం చెప్తే కనిపెట్టలేనంత దానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. నువ్వు నా మనవడు దూరంగా ఉన్నారేంటి. మీ ఇద్దరి మధ్యనా ఏమైనా గొడవలు ఉన్నాయా లేదంటే మీరంతా కలిసి నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అంటుంది. అందర్ని పిలుస్తుంది. మీరు ఇంటి పెద్దల్లా ప్రవర్తిస్తున్నారా అని ప్రశ్నిస్తుంది. మిథున ఒంటరిగా ఇక్కడ పడుకోవడం మీకు కనిపించడం లేదా అని అడుగుతుంది. సత్యమూర్తి, శారదల్ని ప్రశ్నిస్తుంది. మిథున ఎప్పుడూ ఇక్కడే పడుకుంటుందని కాంతం చెప్పేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!