Ammayi garu Serial Today Episode విరూపాక్షి కవల పిల్లల్లో ఒకర్ని విరూపాక్షి చంపేస్తుంది. అది విరూపాక్షి తండ్రి చూసి పాపిష్టిదానా బయట నా అల్లుడితో మంచిగా మాట్లాడి మహాలక్ష్మీ వస్తుందని చెప్పి ఇంత దారుణానికి పాల్పడతావా నా అల్లుడికి ఇప్పుడే విషయం చెప్తానని వెళ్లబోతే ఆయన్ను సిలిండర్‌తో కొట్టి తలగడ అడ్డు పెట్టి ఊపిరాడకుండా చేసి విజయాంబిక చంపేస్తుంది. విజయాంబిక దారుణాలు చూసిన నర్స్ వణికిపోతుంది.
విజయాంబిక నర్స్‌తో ఎవరైనా అడిగితే పుట్టిన కవలల్లో ఒకరు చనిపోయారన్న వార్త విని గుండె పగిలి చనిపోయారని చెప్పు అని ఎవరికైనా చెప్తే నీకు ఆయన పట్టిన గతే పడుతుందని అంటుంది. నర్స్ బయటకు వెళ్లి కవల పిల్లల్లో ఒకరు చనిపోయారని చెప్తుంది. సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. మీ మామయ్యగారు కూడా చనిపోయారని చెప్తుంది. విజయాంబిక చెప్పినట్లే చెప్తుంది. సూర్యప్రతాప్ వాళ్లు పరుగున వెళ్లి చూస్తారు. అప్పుడు జరిగిన ఈ స్టీరీ విజయాంబిక దీపక్‌తో చెప్తుంది. ఆరోజు నువ్వు ఆ పాపని చంపితే ఈ రుక్మిణి ఎక్కడ నుంచి వచ్చిందని దీపక్ అనుకుంటాడు.
విజయాంబిక: తమ్ముడు అందర్ని నమ్మించాలని ఈ రుక్మిణి ప్రయత్నిస్తుంది.దీపక్: మామయ్య రూప చనిపోయిన రోజు ఈ రుక్మిణి వచ్చింది అంటే అర్థమవుతుంది మామయ్య. మన రూప కోసం చాలా సార్లు న్యూస్ పేపర్లలో వేయించాం. రూప, రాజుల ప్రేమ పెళ్లి గురించి కూడా చాలా సార్లు పేపర్లు, టీవీల్లో వచ్చింది అప్పుడు లేని రుక్మిణి ఇప్పుడు రావడం ఏంటి.విరూపాక్షి: వాళ్ల మాటలు నమ్మెద్దు సూర్య.సూర్యప్రతాప్: వాళ్ల మాటలే కాదు నేను ఎవరి మాటలు నమ్మే పరిస్థితిలో లేను. నన్ను ప్రశాంతంగా వదిలేయండి.విజయాంబిక: రుక్మిణి విన్నావు కదా ఇక బయల్దేరు.రుక్మిణి: ఆ ముక్క చెప్పడానికి నువ్వు ఎవరు అత్త ఆ మాట మా నాయనతో చెప్పమను. విజయాంబిక: తమ్ముడు చెప్పు తమ్ముడు దాన్ని వెళ్లిపోమని చెప్పు.సూర్యప్రతాప్: నా ఇంటికి వచ్చింది నా కూతురు కాకపోయినా నా రూపలాగే కనిపిస్తుంది. ఈ రుక్మిణి మీరు చెప్పినట్లు వేరే అమ్మాయా.. రుక్మిణి చెప్పినట్లే నా రెండో కూతురా.. లేక రాజు చెప్పినట్లు తనే రూపనా అని తేలే వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. రుక్మిణి: ఈడనే ఉండమని చెప్పి అలా వెళ్లిపోతావ్ ఏంటి నాయనా. నేను ఈడనే ఉండాలి అంటే నాతో పాటు మా అమ్మ కూడా ఈడనే ఉండాలా. విజయాంబిక: చూశావా తమ్ముడు ఈ విరూపాక్షి ఇక్కడ ఉండాలి అనే ప్లాన్‌తోనే ఈ అమ్మాయిని తీసుకొచ్చింది.రుక్మిణి: ఓసినా జుత్తుల మారి అత్తో మా అమ్మ మీద నూరి పోసింది ఆపు. నాయనా నేనేమో ఈ ఇంటికి కొత్త. పైగా నన్ను ఈడ ఎవరూ ఈ ఇంటి బిడ్డగా నమ్మడం లేదు. నన్ను నా అమ్మ ఒక్కర్తే ఇక్కడ నమ్ముతుంది. అందుకే మా అమ్మ కూడా నాతో ఉండాలి అని అనిపిస్తుంది. అది మీకు ఇష్టం లేకపోతే వద్దులే నాయనా. నేను మా అమ్మతో పాటు వెళ్లిపో. పదమ్మా.సూర్యప్రతాప్: ఆగండి.. నువ్వు అడిగినట్లు నీతో పాటు మీ అమ్మ కూడా ఇంట్లో ఉండొచ్చు.
సూర్యప్రతాప్ మాటతో రుక్మిణి తండ్రిని హగ్ చేసుకుని మురిసిపోతుంది. రుక్మిణి హగ్ చేసుకోవడంతో సూర్యప్రతాప్ రూపని గుర్తు చేసుకుంటాడు. తెలీకుండా తన చేతిని రుక్మిణి తల నిమరడానికి తీసుకెళ్లి మళ్లీ ఏడుస్తూ వెనక్కి తీసుకుంటారు. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రుక్మిణి విజయాంబిక దగ్గరకు వెళ్లి అత్తో నన్ను మా అమ్మని వెళ్లగొట్టడానికి చాలా ప్రయత్నించావ్ కదా ఇప్పుడు నాకు మా అమ్మకి ఉండటానికి గది నువ్వే ఏర్పాటు చేయ్ అంటుంది. తర్వాత చంద్ర, సుమ దగ్గరకు వెళ్లి చిన్నాయన, చిన్నమ్మ మీరేం కంగారు పడకండి నేను ఈ ఇంటి బిడ్డనే అని అంటుంది. ఇద్దరూ సంతోషంగా ఫీలవుతారు. తర్వాత రుక్మిణి రూప ఫొటోకి దండ వేసి దండం పెట్టుకుంటుంది.
రాజు బంటీని తీసుకొని రూప గదికి వెళ్తాడు. రూపతో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏడుస్తాడు. బంటి మొత్తం చూసి నాన్న ఇది అమ్మ రూమా అని అడుగుతాడు. అమ్మకి కూడా నాలా పింక్ కలర్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. అవును బంటీ కానీ నీలా అమ్మకి కాదు అమ్మ లా నీకు పింక్ ఇష్టం అంటాడు. అక్కడే బాబా బొమ్మ చూసిన బంటీ ఎందుకు ఇలా చేశావ్ బాబా నాకు నువ్వు తెలిసినప్పటి నుంచి నేను కోరుకున్న ఒకే ఒక్క కోరిక మా అమ్మని అడిగాను. ఇచ్చినట్లే ఇచ్చి అమ్మని దూరం చేశావ్ అని ఏడుస్తాడు. బంటీ మాటలకు రాజు చాలా ఏడుస్తాడు. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది. బంటీ మీ నాన్నతో మాట్లాడాలి నువ్వు మీ తాత దగ్గరకు వెళ్లు అని అంటుంది.
రుక్మిణి రాజుని ఏయ్ రైస్ పీస్ అని పిలుస్తుంది. రాజు షాక్ అయిపోతాడు. నన్ను అలా మా అమ్మాయిగారే పిలవాలి ఇంకెవరూ పిలవొద్దు అని అంటాడు. రైస్ పీస్ మా అమ్మాయిగారికి మాత్రమే అంటాడు. మళ్లీ మళ్లీ రుక్మిణి పిలవడంతో తిడతాడు. దాంతో రుక్మిణి ఒక్కటిస్తుంది. రాజు షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!