Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిలిపట్టు ప్రాంతంలో తెల్లవారుజామున ట్రక్‌ని కార్ ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సిమెంట్ బ్యాగ్స్ లోడ్‌తో వస్తున్న ట్రక్‌ని కార్ బలంగా ఢీకొట్టింది. ఓ ట్రిప్‌కి కార్‌లో తిరిగి వస్తున్న ఆరుగురు మృతి చెందారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కార్ డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. ఎదురుగా వస్తున్న ట్రక్‌ని ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులతో పాటు ఫైర్, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అరగంటలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తిరణేల్‌వెలిలోని ఆసుపత్రికి ఈ మృతదేహాలను తరలించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు. అంతకు ముందు జనవరి 24వ తేదీన తమిళనాడులో ధర్మపురి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తొప్పూర్ ఘాట్‌రోడ్‌లో నాలుగు వాహనాలు ఒకటికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిద్రలోకి జారుకున్న కార్ డ్రైవర్, రెప్పపాటులో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Ram Manohar
Updated at:
28 Jan 2024 03:07 PM (IST)
Tamil Nadu News: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. (Image Credits: ANI)