Bihar Political Crisis: ఆయా రామ్ గయా రామ్‌ లాంటి వాళ్లుంటారు - నితీశ్ రాజీనామాపై ఖర్గే సెటైర్లు

Nitish Kumar resignation: నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సెటైర్లు వేశారు.

Continues below advertisement

Bihar CM Nitish Kumar Resigns: నితీశ్ కుమార్ రాజీనామాపై (Nitish Kumar Resigns) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ఇలా జరుగుతుందని తెలుసని తేల్చి చెప్పారు. ఆయా రామ్ గయా రామ్‌ లాంటి వాళ్లు ఉంటారని సెటైర్లు వేశారు. ఆయన కూటమిలో (INDIA Alliance) ఉండాలనుకుని ఉంటే కచ్చితంగా ఉండే వారని, కానీ ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఏం చేయగలమని అసహనం వ్యక్తం చేశారు. తాము ఇప్పుడు ఏం మాట్లాడినా అది తప్పుడుగా ప్రచారమవుతుందని అన్నారు. 

Continues below advertisement

"ఇప్పటి వరకూ మేమూ ఆయన కలిసి పోరాటం చేశాం. లాలూ ప్రసాద్ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌తో మాట్లాడినప్పుడు వాళ్లు కూడా నాకీ విషయం చెప్పారు. నితీశ్ కుమార్ వెళ్లిపోతారని అన్నారు. ఆయన ఉండాలనుకుని ఉంటే ఉండే వాళ్లు. కానీ ఆయన అలా అనుకోలేదు. కానీ ప్రస్తుతం మేం కూటమి విషయంలో ఏం మాట్లాడినా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. గతంలోనూ లాలూ నాకు సంకేతాలిచ్చారు. ఇప్పుడది నిజమైంది. దేశంలో చాలా మంది ఆయా రామ్ గయా రామ్ లాంటి నేతలుంటారు"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

 

ఇప్పటికే నితీశ్ కుమార్‌కి ఈ విషయమై లేఖ రాశానని, ఆయనతో మాట్లాడడానికీ ప్రయత్నించానని ఖర్గే తెలిపారు. కానీ అందుకు ఆయన ఆసక్తి చూపించలేదని వెల్లడించారు. కొంత కాలంగా కూటమిలో (INDIA Bloc) ఈ లుకలుకలు బయట పడుతూనే ఉన్నాయి. వీలైనంత వరకూ ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నితీశ్ కుమార్‌తో మాట్లాడేందుకు ఖర్గే రెండు మూడుసార్లు ప్రయత్నించారని, కానీ ఆయన బిజీగా ఉన్నారని వెల్లడించారు.

"నితీశ్ మనసులో ఏముందో తెలియదు. నేను ఢిల్లీకి వెళ్లి అన్ని వివరాలూ కనుక్కుంటాను. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కానీ కూటమిలోని అన్ని పార్టీలనూ కలిసికట్టుగా ఉంచేలా మా వంతు ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరితోనూ మాట్లాడుతున్నాం. అంతా కలిసి ఉంటేనే లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేయగలం అని నచ్చచెప్పాను. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మేమంతా కలిసి ఉండాల్సిన అవసరముంది"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

Also Read: CM Nitish Kumar Resigns: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా, మహాఘట్‌బంధన్‌కి గుడ్‌బై

Continues below advertisement