Vishwak Sen Gaami First Look: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కామెంట్స్‌, సినిమాలతో ఎప్పుడు కాంట్రవర్సల్‌ అవుతుంటాడు ఈ యంగ్‌ హీరో. వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో ఫ్యాన్స్‌ అలరించే ఈ మాస్‌ హీరో ఇప్పుడు ఓ థ్రిల్లర్‌ సినిమాతో రాబోతున్నాడు. అదే 'గామి'. దర్శకుడు విద్యాదర్ కగిట  ఈ చిత్రాన్ని అడ్వేంచర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్‌తోనే బజ్‌ క్రియేట చేసిన ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యి చాలా రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఫస్ట్‌లుక్‌ రాలేదు. ఈ క్రమంలో ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ చేశారు మేకర్స్‌. హైదరాబాద్‌లో జరుగుతున్న కామిక్‌ కాన్‌ మూవీ ఫెస్టివల్లో గామి ఫస్ట్‌లుక్‌ను లాంచ్‌ చేశారు. 


దీనిపై ఇప్పటికే మూవీ టీం ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే జనవరి 28న మధ్యాహ్నం 3:30 గంటలకు కామిక్‌ కాన్‌ మూవీ ఫెస్టెవల్లో గామి ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ లుక్‌ సరికొత్తగా ఉంది. అఘోరగా లుక్‌లో ఉన్న అతడి చూట్టూ మనుషులు చేతులు తాకడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాయి. మొత్తం బ్లాక్‌అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ పోస్టర్ పై రాసిన ఒక కొటేషన్ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది. “అతడి అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే” అంటూ మూవీ పై క్యూరియసిటీ పెంచింది మూవీ టీం. ఈ సినిమా విశ్వక్‌ సేన్‌ 'శంకర్' అనే అఘోరాగా నటిస్తున్నాడట. 


Also Read: భార్య బిగ్‌బాస్‌ హౌజ్‌లో - ఇంట్లో అమ్మాయిలతో భర్త పార్టీ - అంకిత లోఖండే రియాక్షన్‌  


గామిలో అతడి క్యారెక్టర్‌ చాలా విచిత్రంగా ఉండబోతుందట. మానవులు స్పర్శకు భయపడే అఘోరా అని తెలుస్తుంది. ఫస్ట్‌లుక్‌ రిలీజ్ సందర్భాంగా మూవీ డైరెక్టర్‌ విద్యాదర్ కగిట మాట్లాడుతూ.. అడ్వేంచర్‌ డ్రామా ఈ సినిమా ఉండబోతుంది. ఈ కథ అఘోరాల చూట్టు తిరుతుందన్నాడు. అంతేకాదు ఇందులో ఇంకా రెండు విభిన్న పాత్రలు ఉన్నాయని, వాటికి సంబంధించిన పోస్టర్స్ కూడా త్వరలోనే పరిచయం చేస్తామన్నారు. అలాగే సినిమా విడుదల తేదీ, ఇతర తారాగాణంపై కూడా త్వరలోనే ప్రకటన ఇస్తామని మేకర్స్‌ తెలిపారు. కలర్‌ ఫొటో ఫేం చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎం జి అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్‌ రీసెంట్‌గా నటించిన  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుంది.