టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ, బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. చిన్న హీరో సినిమాగా వచ్చి స్టార్ హీరోల రేంజ్ లో వసూళ్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల్లోనూ ఎవరూ ఊహించని కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా నిలబడిన ఈ సినిమా, ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో లేటెస్టుగా మరో సరికొత్త రికార్డుని సెట్ చేసింది. ఫుట్ ఫాల్స్ విషయంలో ఈ మధ్య కాలంలో ఏ సినిమా నమోదు చేయని నంబర్స్ ని సొంతం చేసుకుంది.
'హనుమాన్' సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మౌత్ టాక్ బాగుండటంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో రోజు రోజుకూ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ పోయింది. మూడో వారంలోనూ హౌస్ ఫుల్స్ తో మాసివ్ రన్ ని కంటిన్యూ చేస్తోంది. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకూ 1 కోటికి పైగా ఫుట్ ఫాల్స్ ని సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒక మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసిన సినిమా ఫుట్ ఫాల్స్ విషయంలో ఇలాంటి రేర్ ఫీట్ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు.
నార్త్ అమెరికాలో హనుమాన్ ర్యాంపేజ్..
'హనుమాన్' సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్లకుగాపై గ్రాస్ తో రూ. 130 కోట్ల వరకూ షేర్ రాబట్టి ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. ఓవర్ సీస్ లో హనుమాన్ ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్-5 తెలుగు సినిమాగా నిలిచింది. అలానే హిందీలో ఈ సినిమా 50 కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. నార్త్ ఇండియాలో హిందీ వర్షన్ ఇప్పటి వరకూ దాదాపు రూ. 43 కోట్లు కలెక్ట్ చేయగా, తెలుగు వెర్షన్ రూ. 2.40 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రానున్న రోజుల్లో 'హనుమాన్' మూవీ 300 కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో తెలుగులో కొత్త సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో, మరికొన్ని రోజులు హనుమంతుడి హవా నడిచే అవకాశం ఉంది. ఇక హిందీలో 'ఫైటర్' మూవీ పోటీలో ఉన్నప్పటికీ, తేజ సజ్జా సినిమా స్టడీగా కలెక్షన్స్ అందుకుంటోంది. మరి మున్ముందు ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో, ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
'హనుమాన్' సినిమాలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి తదితరులులు ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరహరి సంగీతం సమకూర్చగా, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Also Read: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి రవితేజ!