ప్రపంచఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు ఎయిడ్స్ కారణంగా మరణించిన వారి సంఖ్య దాదాపు 36.3 మిలియన్లు ఉండొచ్చు. ఈ వ్యాధి ప్రపంచంలో ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోందని ఎప్పుడో తేల్చి చెప్పింది WHO.ఎయిడ్స్ సోకిన వ్యక్తుల రోగనిరోధక శక్తి చాలా నీరసించిపోతుంది. ఏ వ్యాధి అయినా వీరిపై సులువుగా దాడిచేయగలదు. చివరికి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ఎయిడ్స్ ఉన్నవారికి సులువుగా రాగలవు. ఇంతవరకు ఎయిడ్స్ కు మందును కనుగొనలేకపోయింది మన ఆరోగ్య వ్యవస్థ. హెచ్ఐవీ వైరస్ సోకిన వ్యక్తికి సకాలంలో చికిత్స అందకపోతే అది ఎయిడ్స్ గా మారిపోతుంది. దీని అంతానికి గత నలభై ఏళ్లుగా ఆరోగ్యవ్యవస్థ కష్టపడుతూనే ఉంది. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఒక శుభవార్తను మోసుకొచ్చారు. త్వరలోనే ఎయిడ్స్ అంతాన్ని మానవజాతి చూడబోతోందని చెబుతున్నారు.
Also read: ఎక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆపడం కష్టంగా ఉందా... ఇలా చేయండి
ఫిలిస్ కంకి... ఈయన హెల్త్ సైన్స్ ప్రొఫెసర్. తనకు ఇరవై ఏళ్ల వయసు నుంచే ఎయిడ్స్ అంతం కోసం పనిచేస్తున్నారు. హెచ్ ఐవీ వైరస్ గురించి తెలిసిన వెంటనే దాన్ని నిర్మూలించే వ్యాక్సిన్లు, మందుల తయారీ విభాగాలలో ఈయన పనిచేశారు. ఇప్పుడు ఆయన చాలా నమ్మకంగా ఓ విషయాన్ని ప్రపంచానికి తెలియచేశారు. ‘మీరూ, నేను.... ఈ సకల మానవజాతి, ఎయిడ్స్ మహమ్మారి అంతాన్ని చూడబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని ఫిలిస్ చాలా గర్వంగా ఓ హెల్త్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అదే నిజమైతే మరో మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదిలిపోయినట్టే భావించవచ్చు. అంతకుముందు కలరా, పోలియో వంటివెన్నో మానవజాతిని అంతం చేసేందుకు ప్రయత్నించి నాశనమయ్యాయి. అదే కోవలోకి ఎయిడ్స్ కూడా చేరబోతోందన్న మాట.
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
ఇంకా పదేళ్లే...
ఇప్పటి నుంచి సరిగ్గా పదేళ్ల తరువాత ఎయిడ్స్ ప్రపంచంలో అరుదుగా కనిపించే వ్యాధిగా మారుతుందని చెబుతున్నారు ఫిలిస్. దాన్ని సమర్థవంతంగా నయం చేయగల మందులు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఎయిడ్స్ కనీసం టీకా కూడా లేదు. హెచ్ఐవీ వైరస్ సంక్రమణను తగ్గించే టీకా వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. అదే జరిగితే... ఎంతో మంది ప్రాణాలకు రక్షణ దొరుకుతుంది. అంతేకాదు ఎయిడ్స్ కారణంగా అవమానాలకు, బహిష్కరణలకు గురవుతున్న కుటుంబాలకు కొత్త జీవితం లభిస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి