అధిక రక్తపోటు చాలా ఆరోగ్యసమస్యలకు కారణమవుతుందని అందరికీ తెలిసిందే. కానీ కొత్త అధ్యయనంలో రక్తపోటు తక్కువగా ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుందని తేలింది.  బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తగ్గిన రోగుల్లో, ఆ తరువాతి కాలంలో రక్తపోటు తక్కువగా నమోదవుతుంటే వారిలో మరణించే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధనలో బయటపడింది. ఇది చాలా మంది స్ట్రోక్ వచ్చిన రోగులను కలవర పెట్టే అంశమే. 
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
కొత్త అధ్యయనం ప్రకారం క్యాన్సర్, డిమెన్షియా వంటి వ్యాధులు కలిగిన బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్ట్రోక్ వచ్చిన రోగుల్లో బీపీ తక్కువగా నమోదవుతుంటే మరణించే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ అధ్యయనం ఫలితాలు ‘ద జర్నల్ స్ట్రోక్’లో ప్రచురించారు.  మరణించే ప్రమాదం ముఖ్యంగా స్మోకింగ్ చేసే వారిలో, గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా ఇంకా అధికంగా ఉంటుందని అధ్యయనకర్త హ్యూగో జె. అపారిసియో వివరించారు. ఈ అధ్యయనం బోస్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో కొన్నేళ్ల పాటూ నిర్వహించారు.
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
వేలమందిపై పరిశోధన
ఈ పరిశోధన కోసం 30,000 మంది స్ట్రోక్ బారిన పడిన రోగులను పరిశీలించారు. వారిలో అధిక రక్తపోటు ఉన్న వారిని ఒక విభాగంగా, తక్కువ రక్తపోటు కలిగిన వారిని మరో విభాగంగా విభజించారు. 18 నెలల పాటూ వారి రక్తపోటును గమనించారు. తక్కువ రక్తపోటు కలిగి ఉన్న వ్యక్తులు అత్యధికంగా మరణించినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా వారందరికీ కూడా గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, స్మోకింగ్, డిమెన్షియా వంటి వాటిలో కనీసం ఒక్కటైనా ఉన్నట్టు కనిపెట్టారు. దీన్ని బట్టి సాధారణ రోగులతో పోలిస్తే స్ట్రోక్ వచ్చాక తక్కువ రక్తపోటు నమోదయ్యే వారిలో మరణాల రేటు 10 శాతం అధికంగా ఉంటుందని అధ్యయనం తేల్చింది. 


ఈ అధ్యయన ఫలితం స్ట్రోక్ రోగులు, వారి కుటుంబీకులకు ఎంతో సహాయపడుతుందని, వారు పరిస్థితులను అంచనా వేసుకునేందుకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు అధ్యయనకర్తలు భావిస్తున్నారు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: ఎక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆపడం కష్టంగా ఉందా... ఇలా చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి