పోషకాలు నిండాగా ఉండే వంటకం కిచిడీ. ఈ వంటకం చేయడం కూడా చాలసులువు. పిల్లలకు, పెద్దలకు... ఇద్దరికీ కావాల్సిన శక్తిని అందిస్తుంది కిచిడీ. ఇదో కలగూర వంటకం. రకరకాల కూరగాయలు వేసి వండే దీనిలో లభించే పోషకాలు కూడా అధికమే.


కావాల్సిన పదార్థాలు
బియ్యం - అరకప్పు
పెసరపప్పు - అయిదు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
టమాటా -ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
క్యారట్, క్యాప్సికమ్, బంగాళాదుంప ముక్కలు - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు
నెయ్యి - ఒక స్పూను
నూనె - తగినంత
లవంగాలు - రెండు
దాల్చిన చెక్క - ఒకటి
బిర్యానీ ఆకు - ఒకటి
కారం - అర టీస్పూను
పసుపు - పావు స్పూను
కరివేపాకు - ఒక రెబ్బ
గరం మసాలా - అర టీస్పూను
నీళ్లు - మూడు కప్పులు
జీలకర్ర - అరటీస్పూను


తయారు చేసే విధానం
1. బియ్యం, పెసరపప్పు కడిగి ఓ అరగంట పాటూ నానబెట్టాలి.
2. కుక్కర్లో నెయ్యి, నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత నిలువుగా కోసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా కలపాలి. అవి వేగాక టమాటా ముక్కుల వేసి మెత్తగా ఉడికే దాకా మగ్గించాలి. తరువాత క్యారెట్, క్యాప్సికల్, బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించాలి. పసుపు, కారం, గరంమసాలా, ఉప్పు వేసి చిన్న మంట మీద ఉడికించాలి. కూరగాయలు 60 శాతం ఉడికాక బియ్యం, పెసరపప్పును వేయాలి. ఉడికేందుకు తగినన్ని నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ కట్టేయాలి. కుక్కర్ మూత తీశాక గరిటెతో బాగా మెదపాలి. మెత్తని కిచిడీ సిద్ధం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 


Also read: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి


Also read: సింగిల్ మెన్‌కు బ్యాడ్ న్యూస్... అలా ఒంటరిగా జీవిస్తే ఆరోగ్యసమస్యలు అధికంగా వచ్చే అవకాశం, కొత్త అధ్యయన ఫలితం


Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...


Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి


Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...


Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది



















 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌