Walking: రోజుకు 10,000 అడుగులు వేస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు, మొదలుపెట్టండి మరి

భయంకరమైన రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో చెప్పలేం.

Continues below advertisement

ప్రపంచంలో ప్రతి ఏడాది క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.ఎప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో చెప్పలేం. ముఖ్యంగా ఆధునిక అలవాట్లు, చెడు ఆహారం కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతోంది. కాగా క్యాన్సర్ రాకుండా ముందుగానే అడ్డుకునే వ్యాయామం గురించి చెప్పాయి కొన్ని ప్రముఖ మెడికల్ జర్నల్‌లు. అందులో క్యాన్సర్ అడ్డుకోవాలంటే ఏం చేయాలో, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో కూడా వివరించారు. భవిష్యత్తులో ఏ రకమైన క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజుకు 10,000 అడుగులు వేయాలి. అంటే వాకింగ్ చేయమని అర్థం. పదివేల అడుగులకు తక్కువ కాకుండా రోజూ వాకింగ్ చేసే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుందట.దాదాపు 78,500 మంది పెద్దలపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. సిడ్నీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకుడు డాక్టర్ మాథ్యూ మాట్లాడుతూ ‘ఆరోగ్యపరంగా రక్షణాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందుగానే క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా జాగ్రత్తపడాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే పదివేల అడుగులు తప్పకుండా వేయాలి’ అన్నారు. 

Continues below advertisement

ఆ సమస్యలు రావు
రోజుకు పదివేల అడుగులు వేయలేని వాళ్లు దాదాపు 3,800 అడుగులు వేసినా చాలు మానసిక ఆందోళనలు వచ్చే అవకాశం పాతికశాతం తగ్గుతుంది. అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. అదే రెండు వేల అడుగులు వేస్తే అకాల మరణం సంభవించే అవకాశం 8 నుంచి 11 శాతం తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా రావడం చాలా మేరకు తగ్గుతాయి. 

అధ్యయనం ఎలా?
దాదాపు ఏడేళ్ల పాటూ అధ్యయనాన్ని నిర్వహించారు. 40 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారిని ఇందుకు ఎంచుకున్నారు. ఏడేళ్ల పాటూ వారి ఆరోగ్యాన్ని, వ్యాయామాన్ని, నడకను పరిశీలించారు. అందులో రోజులో ఎక్కువసేపు నడిచే వారికి ఆరోగ్యం సక్రమంగా ఉంది. వారిలో క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వచ్చిన ఆనవాలు కూడా తగ్గాయి. మిగతా రోగాలు కూడా వచ్చే ప్రమాదం చాలా మేరకు తగ్గినట్టు గుర్తించారు. కాబట్టి శారీరక శ్రమ ఎంతగా ఉంటే ఆ శరీరం అంతగా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం.  

అందుకే ప్రతి ఒక్కరూ రోజూ కనీసం అరగంట సేపు నడవాలని సూచిస్తున్నారు వైద్యులు. రోజులో అరగంటసేపు మీ ఆరోగ్యం కోసం వెచ్చించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల భవిష్యత్తులో ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవకాశం తగ్గిపోతుంది. 

Also read: జాక్ అంటే ఎవరు? పనసపండు పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా

Also read: గుడ్లగూబల్లో ఓ పిల్లి దాక్కుంది, మీకు కనిపించిందా? అర సెకనులో కనిపెట్టండి చూద్దాం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Continues below advertisement
Sponsored Links by Taboola