కళ్లను మాయచేసే అందమైన కళ ఆప్టికల్ ఇల్యూషన్. ఒకసారి వీటికి అలవాటు పడితే ఇక వాటి కోసం వెతుకుతూనే ఉంటారు. కళ్ల ముందే జవాబు ఉన్నా కూడా వెంటనే కనిపెట్టలేకపోవడమే వీటి ప్రత్యేకత. ఇక్కడ మీకో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో పెద్ద పెద్ద కళ్లతో గుడ్ల గూబలు ఉన్నాయి. ఆ మధ్యలో నోరు తెరుచుకుని ఓ పిల్లిపిల్ల ఇరుక్కుని ఉంది. దాన్ని మీరు కేవలం అరసెకనులో కనిపెట్టి చెప్పాలి. మేం ఇప్పటికే మీకు హింట్ కూడా ఇచ్చేశాం. నోరు తెరుచుకుని ఉంది పిల్లి అని చెప్పేశాం. చాలా కొద్ది మంది మాత్రమే ఈ పజిల్‌ను అరసెకనులో పరిష్కరించగలిగారు. మీరు ఆ కొద్ది మందిలో ఉన్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి.  చాలా ఫన్ గా కూడా ఉంటుంది.


జవాబు ఇదిగో...
ఇందులో ఉన్న పిల్లిపిల్లని కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక కనిపెట్టలేని వారికి అదెక్కడ ఉందో చెప్పే ప్రయత్నమే ఇది. ఇందులో ఉన్న గుడ్లగూబల ముక్కుల స్థానంలో పిల్లి తెరిచిన నోరు ఉంటుంది. అలాగే తలపై రెండు చెవులు కూడా ఉంటాయి. ఇప్పటికీ పిల్లి దొరక్కపోతే ఫోటోలో మూడో లైనులో చివరన చూడండి. మీకు పిల్లి దొరికేస్తుంది. 


ఆఫ్టికల్ ఇల్యూషన్లు మెదడుకు, కంటికి సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును పెంచుతాయి. పదునైనా ఆలోచనలు వచ్చేలా చేస్తాయి. ఇవి ఎన్నో ఏళ్లుగా వినోదంలో భాగమయ్యాయి. కానీ ఎవరు, ఎప్పుడు కనిపెట్టారో, ఏ కాలంలో మొదటిసారి చిత్రీకరించారో మాత్రం తెలియదు. సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి ఈ పజిళ్లు. వీటిని చూడడం కంటి చూపు, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు.  విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి. 


ఒకప్పుడు గోడలపై కుడ్యచిత్రాల రూపంలో ఈ చిత్రాలు ఉండేవి. అలాంటి వాటిల్లో అతి పురాతన మైనది తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఐరావతేశ్వర గుడి గోడలపై ఉంది. దీని వయసు దాదాపు  900 ఏళ్లు. 12వ శతాబ్ధపు శిల్పకళను ఇవి ప్రతీకలుగా నిలిచాయి. చోళుల శిల్పకళా చాతుర్యానికి ఇవి మచ్చుతునకలు. ఇందులో రెండు జంతువులు ఉన్నాయి. ఒకటి ఎద్దు, రెండోది ఏనుగు. ఈ రెండూ కలిసి ఉన్నట్టు కనిపిస్తాయి. కొందరికి ఎద్దు కనిపిస్తే, మరికొందరికి ఏనుగు స్పురిస్తుంది.  ఏది ఏమైనా ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల కంటికి, మెదడుకు మేలే జరుగుతుంది. పిల్లలకు కూడా వీటిని ఓసారి నేర్పించి చూడండి. వారిలో ఏకాగ్రత పెరిగేందుకు ఇది దోహదం చేస్తాయి.


Also read: ఆ ఆలయం గోడలపై 900 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూషన్ , ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది


Also read: ఇది హ్యాండ్ బ్యాగే కాదు గన్ కూడా, మహిళల ఆత్మరక్షణ కోసమే ప్రత్యేకం