Lips Drying Reason : వేసవి కాలంలో చాలా మందికి పెదవులు పొడిబారడం సర్వసాధారణం. ఈ సమస్యతో ఎన్ని రోజులుగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నప్పటికీ  పెద్ద ఆరోగ్య సమస్యగా పట్టించుకోరు. అయితే శరీరంలో జరిగే మార్పులను తెలియజేస్తుందని, లోపాలను సరి చేసేకునేందుకు ఇదో సంకేతం. ఇలాంటివి గమనించకుండా నార్మల్‌ అని ఊరుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టేనని గ్రహించాలి. అసలు లిప్స్ ఎందుకు డ్రై అవుతాయి... దీనికి కారణాలేంటో చూద్దాం.  

పెదవులు పొడిబారడం సాధారణ సమస్య అయినా  తరచుగా దీన్ని ఫేస్ చేస్తుంటే మాత్రం మేల్కోవాల్సింది.  శరీరంలో తీవ్రమైన లోపానికి ఇదో సంకేతం కావచ్చు. కానీ చాలా మంది దీనిని వాతావరణానికి ముడిపెట్టి లైట్ తీసుకుంటారు. కానీ నిజానికి పొడి పెదవులు శరీరంలో పోషకాలతోపాటు తగ్గిన నీటి శాతాన్ని స్పష్టంగా చెబుతాయి. ఇన్‌టైంలో శ్రద్ధ పెట్టకుంటే మాత్రం పెద్ద వ్యాధులకు కారణం కావచ్చు. 

నీటి శాతం తగ్గడంశరీరంలో తగిన మోతాదులో నీరు ఉండాలి. ఇది చాలా అవసరం కూడా. అలా లేకుంటే డీహైడ్రేట్ అవుతారు.. ఈ డీహైడ్రేషన్ కారణంగా మొదట ఎఫెక్ట్‌ అయ్యేది పెదవులే. ఎందుకంటే పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. నీటి లోపం వల్ల పెదవులు పొడిగా మారుతాయి. త్వరగా పగిలిపోతాయి. తరచుగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రం రావడం, త్వరగా అలసిపోవడం ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ లక్షణాలు.

విటమిన్ B2 లోపంవిటమిన్ B2 శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కణాల ఆరోగ్యానికి బూస్టు లాంటిది. అందుకే ఈ విటమిన్ లోపించినా సరే పెదవుల చివర్లు పగులుతాయి. నొప్పి పుడుతుంది. వాచినట్టు కనిపిస్తుంది. కొందరికి పెదవులతో పాటు నాలుక, చర్మం పగిలినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బీ2 విటమిన్ లోపాలకు సంకేతాలు. అలాంటి టైంలో రైబోఫ్లేవిన్ అవసరమని శరీరం చెప్పే సంకేతాలు ఇవన్నీ.

ఐరన్ లోపం ఐరన్ లోపం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ స్లోగా జరుగుతుంది.  ఆక్సిజన్ సరఫరా కూడా సరిగా ఉండదు. ఇది కూడా పెదవులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకు- పెదవులు పొడిబారడం, చిట్లడం, రంగు మారడం అన్నీ కూడా ఈ ఐరన్ లోపం లక్షణాలే. దీనితోపాటు అలసట, బలహీనంగా అనిపించడం తలతిరగినట్టు అనిపిస్తుంది.  

జింక్ లోపంజింక్ శరీర రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యం. దీని లోపం వల్ల పెదవులు త్వరగా పొడిబారి చిట్లిపోతాయి. చర్మం కూడా పొడిబారుతుంది. గాయాలు నయం కావడంలో ఆలస్యం అవుతుంది. 

అలెర్జీ, ఇన్ఫెక్షన్చాలా సార్లు పెదవులు తరచుగా పొడిబారడం అలెర్జీ కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు- టూత్‌పేస్ట్, లిప్ బామ్‌ కారణంగా కూడా కొందరికి అలెర్జీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అటువంటి సందర్భాల్లో పెదవులపై ఎరుపు, మంట లేదా దురద పుడుతుంది.  

గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.