Eating Oranges on An Empty Stomach : పరగడుపునే నారింజ తింటే ఏమవుతుంది? లాభమా? నష్టమా?
ఆహార నిపుణుల ప్రకారం ఉదయాన్నే ఖాళీ కడుపుతో నారింజ తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. లేదంటే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
నారింజ పండ్లలో ఆమ్లం ఉంటుంది. కాబట్టి వాటిని ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ఉదయాన్నే వీటిని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి మధుమేహమున్నవారు ఉదయాన్నే వీటిని తినడం మానుకోవాలి.
నారింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి రావడంతో పాటు విరేచనాలయ్యే ప్రమాదముంది.
కేవలం నారింజనే కాదు.. పుల్లటి, సిట్రస్ ఫ్రూట్లకు వీలైనంత దూరంగా ఉండమని చెప్తున్నారు నిపుణులు. లేదంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని చెప్తున్నారు.
ముఖ్యంగా ఎసిడిటీ సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో నారింజ తినకూదు. దానికి బదులుగా పోషకాలుండే ఇతర ఆహారాలను డైట్లో చేర్చుకోవచ్చు.
నారింజను మధ్యాహ్న సమయంలో లేదా ఇతర ఫుడ్స్ డైట్లో తీసుకోవచ్చు. కానీ ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.