Watermelon Side Effects : ఆ సమస్యలున్నవారు పుచ్చకాయ తినకపోవడమే మంచిది.. ఎందుకంటే
పుచ్చకాయ దాదాపు నీటితో నిండి ఉంటుంది. దీనిలో విటమిన్లు, పొటాషియం, లైకోపీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
అయితే పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే వారు దూరంగా ఉండాలని చెప్తున్నారు.
కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలున్నవారు పుచ్చకాయ తినకపోవడమే మంచిది. అలాంటివారు దీనిని తింటే విరేచనాలు, వాంతులయ్యే అవకాశముంది.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పుచ్చకాయను తక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే దీనిలో అధిక నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యలను పెంచుతుంది.
జలుబు, దగ్గు సమస్య ఉంటే పుచ్చకాయ తినడం మానేస్తే మంచిది. ఇది సమస్యను, అసౌకర్యాన్ని పెంచుతాయి.
చర్మ సమస్యలు ఉన్నవారికి అలెర్జీలు రావచ్చు. కాబట్టి మీకు ఏదైనా స్కిన్ అలెర్జీలు ఉంటే దానిని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.
పుచ్చకాయ తియ్యగా ఉంటుంది కాబట్టి.. మధుమేహం ఉన్నవారు తినకపోవడమే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.