గొంతులో లేదా గాలి గొట్టాల్లో ఏదైనా దుమ్ము, ధూళి లాంటిది చేరి ఇబ్బంది పెట్టినప్పుడు అది దగ్గు రూపంలో బయటికి వస్తుంది. దగ్గు వల్ల ఆ దుమ్ముతో పాటూ, అంతర్గతంగా ఏర్పడిన శ్లేష్మం కూడా బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసినా కూడా దగ్గు మాత్రం ఒక్కోసారి ఆగదు. సిగరెట్ పొగ పడక, బ్యాక్టిరియల్ ఇన్ఫక్షన్, అలెర్జీలు, ఆస్తమా... ఇలా రకరకాల కారణాల వల్ల దగ్గు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో త్వరగా దగ్గు ఎటాక్ అవుతుంది. ఈ ఇంటి చిట్కాలతో దగ్గును దూరం చేసుకోవచ్చు. పెద్దలు, పిల్లలు... ఇద్దరూ పాటించదగ్గ చిట్కాలే ఇవి.
1. కొందరికి రాత్రిపూట ఆగకుండా దగ్గు వస్తుంది. అలాంటివారికి తేనె వల్ల ఉపశమనం కలుగుతుంది. గొంతు పొరలపై ఉన్న బ్యాక్టిరియాను, నొప్పిని తేనె తగ్గిస్తుంది.
2. ఉప్పునీళ్లతో రోజూ ఉదయం గార్గిలింగ్ చేయడం వల్ల గొంతులోని బ్యాక్టిరియా మరణించే అవకాశం ఉంటుంది. అలాగే గొంతులో అడ్డు పడుతున్న శ్లేష్మం కూడా మెత్తబడి గాలి ఆడుతుంది. దీనివల్ల దగ్గు ఆగుతుంది.
3. అల్లంలో వికారం, జలుబు తగ్గించే లక్షణాలు ఎక్కువ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువ. కనుక అల్లం రసాన్ని అర చెంచా తాగినా మంచి ఫలితం ఉంటుంది.
4. ఆవిరి పీల్చడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. గొంతులో పట్టేసే సమస్య నుంచి బయటపడేస్తుంది. అక్కడ తేమవంతంగా మారి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
5. అలెర్జీ సమస్యలున్న వారు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడితే మంచిది. ఇది గాలిలోని బ్యాక్టిరియాను, దుమ్మూ ధూళిని గ్రహించేస్తుంది.
6. దగ్గు ఉన్నప్పుడు తరచూ గోరువెచ్చని నీరు తరచూ తాగడం అలవాటు చేసుకోవాలి. గొంతు తడారిపోతే దగ్గు మరింత ఎక్కువైపోతుంది. కాబట్టి తరచూ నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు