World Sleep Day : వివిధ కారణాల వల్ల చాలామంది నిద్రకు దూరమవుతున్నారు. కొందరు దీనిని చాలా తేలికగా తీసుకుని అర్థరాత్రి వరకు ఆన్​లైన్​లో ఉంటున్నారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనిపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ నిద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గురించి.. దానివల్ల కలిగే లాభాలు, సరైన నిద్ర లేకుంటే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. సరైన నిద్రను అందించే వాతావరణాన్ని పెంపొందించుకునే విధంగా ప్రోత్సాహిస్తారు. 


అలా ఉంచితే బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది..


మెరుగైన నిద్రను ప్రోత్సాహించడంలో పడకగది ముఖ్యపాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు. కష్టపడి రూమ్​కి వెళ్లినప్పుడు ప్రశాంతమైన వాతావరణం లేకుంటే నిద్ర అనేది దూరమవుతుందని చెప్తున్నారు. అందుకే పడక గదిని క్లీన్​గా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. దిండును ఉతకకుండా ఉపయోగిస్తే.. వారంలో దానిపై 3 మిలియన్ల బ్యాక్టీరియా చేరుకుంటుంది. ఇది టాయిలెట్ సీటు కన్నా 17000 రెట్లు ఎక్కువ కలుషితమైనదని అమెరిస్లీప్ నివేదిక తెలిపింది. బాత్రూమ్ డోర్ నాబ్ కన్నా.. ఉతకని దుప్పటి 24,631 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.


పడకగదిని ఎలా శుభ్రపరచుకోవాలంటే..


మంచం, పరుపులు పరిశుభ్రత ఎంత అవసరమో చెప్తోంది ఈ తాజా పరిశోధన. ఈ అంశాలపై మరింత అవగాహన కల్పించేందుకు డైసన్​లోని మైక్రోబయాలజీలో లీడ్​ రీసెర్చ్ సైంటిస్ట్ జోవాన్ కాంగ్​ ప్రయత్నిస్తున్నారు. పడక గదిలో ఎక్కువ దుమ్ము, ధూళిని తొలగించే, అలెర్జీలను కలిగించే కీటకాలను ఎలా శుభ్రపరచాలో, వాక్యూమింగ్ క్లీనర్ బెడ్​రూమ్​ను క్రియేట్​ చేసుకోగలిగే చిట్కాలను సూచిస్తున్నారు. పరుపుపై ఉండే దుప్పట్లు, దిండు కవర్లు, కప్పుకునే దుప్పట్లను రెగ్యూలర్​గా ఉతకాలి. ఇలా చేయడం వల్ల అలర్జీలను విచ్ఛినం చేసి.. వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు.


పరుపుల్లోని పురుగులకు ఇలా చెక్ పెట్టండి..


దుమ్ము, అలెర్జీలను దూరం చేసేందుకు వారానికి ఓ సారి పరుపు కవర్లను ఉతకడం, మార్చడం చేయాలి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పరుపుల్లో కొన్ని దుమ్ము పురుగులు ఉంటాయి. పరుపులోని ఫైబర్​లకు అవి అతుక్కొని ఇబ్బంది కలిగిస్తాయి. వాటిని తొలగించడం కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో డైసన్ స్క్రూ టూల్స్​తో పరుపులో దాగున్న దుమ్మును సమర్థవంతంగా తొలగించవచ్చు. పరుపుల్లోని పురుగులు, అలెర్జీ కారకాలను తొలగించేందుకు దిండ్లు, కుషన్లు, లేదా మృదువైన బొమ్మలను వాక్యూమ్ చేస్తే మంచిది. పరుపును శుభ్రం చేసిన తర్వాత రూమ్​లోని అల్మారాలు, వార్డ్​రోబ్​లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటిపై దుమ్ము.. మళ్లీ పరుపులపై పడే అవకాశముంది.


గాలి నాణ్యత


నిద్రకోసం మనం ఎక్కువ సమయం పడక గదిలోనే వెచ్చిస్తాము. ఆ సమయంలో గాలి నాణ్యత మెరుగ్గా ఉండాలి. వివిధ కారణాలతో ఇంటి లోపల కాలుష్యం పేరుకుపోతుంది. వంట చేయడం, వివిధ కారణాలు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఆ సమయంలో వివిధ ద్రావణాలతో ఇంటిని శుభ్రం చేస్తాము. లోపలి దుర్గంధాన్ని పోగొట్టుకునేందుకు క్యాండిల్స్ వెలిగిస్తాము. వీటితో పాటు కాలుష్య కారకాలను బహిర్గతం చేసే ఎయిర్ ప్యూరిఫైయర్​లను ఉపయోగించవచ్చు. 


మీరు ప్యూరీఫైయర్స్ ఉపయోగించాలనుకుంటే.. సమర్థవంతమైన, సెన్సింగ్ సామర్థ్యాలు కలిగిన ఎయిర్ ప్యూరీఫైయర్​ను ఉంచితే మంచిది. అవి హానికరమైన కారకాలను ఫిల్టర్ చేస్తాయి. అంతేకాకుండా ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇది మెరుగైన నిద్రను ప్రోత్సాహిస్తుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దుమ్ము, ధూళీ, అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


Also Read : ఈ పనులు రోజూ చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు హాంఫట్