Karthika Deepam 2 Cast Remuneration: ప్రేమి విశ్వనాథన్‌.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తు పట్టకపోవచ్చు. అదే 'వంటలక్క' అంటే మాత్రం టక్కున పట్టేస్తారు. 'కార్తీక దీపం'(Karthika Deepam 2) సీరియల్‌తో తెలుగు బుల్లితెరపై వంటలక్కగా అలియాస్‌ దీపగా ఎనలేదని ఆదరణ పొందారు ప్రేమి విశ్వనాథ్‌. ఎంతగా అంటే ఆఖరికి ఈమే పేరుతో ఎన్నో రీల్స్‌, మీమ్స్‌.. సినిమాలోనూ ఈ వంటలక్క పేరు వాడేంతగా పాపులర్‌ అయ్యారు. చెప్పాలంటే ఈ వంటలక్క పాత్ర వల్లే 'కార్తీక దీపం' టీఆర్పీ రేటింగ్‌ టాప్‌లో కొనసాగిందనడంలో సందేహం లేదు. అంతగా 'వంటలక్క' పాత్రకు గుర్తింపు పొందిన ప్రేమి విశ్వనాథ్‌ రెమ్యునరేషన్‌ కూడా భారీగా తీసుకునేదట.


ఆరేళ్లుగా ‘కార్తీక దీపం’ సీరియల్‌తో అలరించిన ఆమె ఒక ఎపిసోడ్‌కి రూ.25 వేల వరకు పారితోషికం తీసుకునేదని సమాచారం. బుల్లితెర సీరియల్స్‌ ఫీమేల్‌ యాక్టర్స్‌లో ఆమెదే హయ్యేస్ట్‌ రెమ్యునరేషన్‌ అట. అంతేకాదు ఈ సీరియల్‌ కాస్ట్‌ అందరిలో కూడా ఆమెదే టాప్‌ రెమ్యునరేషన్‌ అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మేల్‌ లీడ్‌ రోల్ నిరుపం పరిటాల (డాక్టర్‌ బాబు) రోజుకు రూ.40వేల పారితోషికం అందుకునేవాడట. అయితే బుల్లితెర సీరియల్లో టాప్‌లో కొనసాగిన ఈ సీరియల్‌కు అనుకోకుండా శుభం కార్డు పడింది. అదీ కూడా హ్యాపీ ఎండింగ్‌ లేకుండ సీరియల్‌కు శుభం కార్డు వేశారు.


వంటలక్క, డాక్టర్ బాబు రెమ్యునరేషన్


దీంతో కార్తీక దీపం ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ అంతా డిసప్పాయింట్‌ అయ్యారు. వంటలక్క ఎలాంటి న్యాయం జరగలేదని, డాక్టర్‌ బాబు వంటలక్క కలవకుండానే ఈ సీరియల్‌ని ఇలా ముగించేశారని అంతా బాధపడ్డారు. కానీ ఇప్పుడు ‘కార్తీక దీపం’కు పార్ట్‌ 2ను ప్రకటించారు. త్వరలోనే ‘కార్తీక దీపం 2.. నవ వసంతం’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఇందులో నిరుపం, ప్రేమి విశ్వనాథ్‌లు తప్పా మిగతా వారంత కొత్తవారే. అతిత్వరలోనే ఈ సీరియల్‌ స్టార్‌ మాలో టెలికాస్ట్‌ కానుంది. ఈ క్రమంలో పార్ట్‌ 2 కోసం వంటలక్క తీసుకునే రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈసారి ఏకంగా డబుల్‌ రెమ్యునరేషన్‌ పెంచేసిందట. పార్ట్‌ 2 కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కి రూ.50వేలు డిమాండ్‌ చేస్తున్నట్టు విశ్వసనీయి సమాచారం. అలాగే డాక్టర్‌ బాబు (నిరుపం) కూడా 'కార్తీక దీపం 2' భారీగా డిమాండ్‌ చేస్తున్నాడు. ఈసారి రూ. 80వేలు పెంచినట్టు తెలుస్తోంది. ‘కార్తీక దీపం’ సీరియల్‌కు ఉన్న క్రేజ్‌ వల్ల మేకర్స్‌ వారు డిమాండ్‌ మేరకు పారితోషికం ఇస్తున్నట్టు టాక్‌. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. 


Also Read: గుడ్‌న్యూస్‌.. వంటలక్క వచ్చేస్తోంది! - ఆ రోజు నుంచే 'కార్తీక దీపం 2' సీరియల్‌ టెలికాస్ట్


కానీ, వంటలక్క, డాక్టర్‌ బాబు రెమ్యునరేషన్ తెలిసి అంతా అవాక్క్‌ అవుతున్నారు. మరి దీనిపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. కాగా, ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ వచ్చే వారం నుంచే టీవీలో ప్రసారం చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో ఓ బజ్‌ మొదలైంది. ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం సీరియల్‌ నెక్ట్స్‌ వీక్‌  లేదా ఆ తర్వాత వారం నుంచి టెలికాస్ట్‌ అయ్యే చాన్స్‌ ఉందట. అంటే  మార్చి 18 లేదా మార్చి 25 నుంచి ఈ సీరియల్‌ ప్రసారం కానుందని ఇన్‌సైడ్‌ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై  మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే మాత్రం ఇక బుల్లితెర ఆడియన్స్‌కి మాత్రం పండగే అని చెప్పాలి.