విశ్వక్ సేన్ (Vishwak Sen)ను కొందరు ట్రోల్ చేస్తుంటే... మరికొందరు అతడిని సపోర్ట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీనంతటికీ కారణం... గామి. మార్చి 8న విడుదలైంది. హాలీవుడ్ రేంజ్ సినిమా అని విమర్శకులు, ప్రేక్షకులు కాంపిమెంట్స్ ఇచ్చారు. కానీ, థియేటర్ల దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు. 'గామి'తో పాటు విడుదలైన డబ్బింగ్ సినిమా 'ప్రేమలు'కు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి. 


'ప్రేమలు' సినిమాను తెలుగులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ డబ్బింగ్ చేశారు. నైజాంలో టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ 'దిల్' రాజు రిలీజ్ చేశారు. ఓపెనింగ్ డే కలెక్షన్స్ బావున్నాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా బావుందని, ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో నవ్వుకోలేదని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. సక్సెస్ మీట్ పెడితే రాజమౌళి వచ్చారు. ఈ నేపథ్యంలో తమ సినిమాను కూడా నలుగురు పెద్ద మనషులు చూసి మాట్లాడితే బావుంటుందని విశ్వక్ సేన్ అన్నారు. ఆ వ్యాఖ్యల మీద విమర్శలు వస్తున్నాయి. 


నన్ను ఎవరూ లేపాల్సిన అవసరం లేదన్నావ్?
'ఫలక్ నుమా దాస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు 'నన్ను ఎవ్వడూ లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా. మళ్ళా మళ్ళా లేపుకుంటా' అని విశ్వక్ సేన్ అగ్రెస్సివ్ స్పీచ్ ఇచ్చారు. ఇప్పటికే ఒకరిని అనవసరంగా లేపామని జనాలు అనుకుంటున్నారని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు తీసి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఎవరి సపోర్ట్ అవసరం లేదని, ఇప్పుడు సపోర్ట్ ఎందుకు అడుగుతున్నావని సెటైర్లు వేస్తున్నారు.


Also Read: జపాన్‌లో 'ఆర్ఆర్ఆర్'కి ఆ క్రేజ్ ఏంటి సామి - రాజమౌళి వస్తున్నాడని తెలిసి ఒక్క నిమిషంలో హౌస్‌ ఫుల్






'గామి'తో టాప్ హీరో అవుతానని విశ్వక్ సేన్ చాలా ఆశలు పెట్టుకున్నాడని, మూవీ బిస్కట్ అయ్యిందని సందీప్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు.






సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారండోయ్!
ఒక వైపు విశ్వక్ సేన్ మీద ట్రోలింగ్ జరుగుతుంటే... మరో వైపు అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్న జనాలు కూడా ఉన్నారు. నలుగురు పెద్ద మనుషులు సినిమా చూడమని కోరడం కూడా తప్పేనా? విశ్వక్ సేన్, గామి సినిమాకు మద్దతుగా కొందరు ట్వీట్లు చేస్తున్నారు. సినిమాకు వ్యతిరేకంగా రేటింగ్స్ ఇస్తున్న వాళ్లపై కంప్లైంట్ చేస్తానని విశ్వక్ పేర్కొన్న విషయం విదితమే.


Also Readజగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!