'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'... ఇదొక సినిమా కాదు, భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకునే చరిత్ర. తొలి ఆస్కార్ తెచ్చిన భారతీయ సినిమాగా తరతరాలకు చెందిన ప్రేక్షకులు గుర్తుంచుకునే ఓ మధుర జ్ఞాపకం. మార్చి 25కు 'ఆర్ఆర్ఆర్' విడుదలై రెండు సంవత్సరాలు అవుతుంది. నిన్నటికి (మార్చి 13కి) ఆస్కార్ వచ్చి ఏడాది అయ్యింది. జపాన్ (RRR In Japan)లో విడుదలై ఏడాదిన్నర కావొస్తోంది. అయినా సరే... సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు ఉదాహరణ... లేటెస్ట్ జపాన్ షో బుకింగ్స్! 


ఒక్క నిమిషంలో థియేటర్ హౌస్ ఫుల్!
'ఆర్ఆర్ఆర్' సినిమా జపాన్ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఏడాదిన్నరగా సినిమా ఆడుతోంది. అందుకని, మార్చి 18న ఓ షోకి రాజమౌళి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియడం జపాన్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. బుధవారం రాత్రి టికెట్స్ ఓపెన్ చేయగా... ఒక్కటంటే ఒక్క నిమిషంలో థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది.


Also Readప్రభాసే నంబర్ వన్ - ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌లో ఏకైక హీరోగా రెబల్ స్టార్!






'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీం పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. నటనతో పాటు 'నాటు నాటు...' పాటలో వేసిన స్టెప్పులు వేయడం ప్రేక్షకులూ ప్రాక్టీస్ చేశారు. సెలబ్రిటీలు సైతం ఆ సాంగ్ స్టెప్స్ వేశారు. 'ఆర్ఆర్ఆర్'కు సీక్వెల్ ఐడియా ఉందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి, అది ఎప్పుడు తెరకెక్కుతుందో!?


Also Readజగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్! 






త్వరలో సెట్స్ మీదకు సినిమా...
మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ షురూ!'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి కొత్త సినిమా ఏదీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన సినిమా చేయనున్న సంగతి ప్రేక్షకులకు కూడా తెలుసు. ప్రజెంట్ ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. 'గుంటూరు కారం' విడుదల తర్వాత కొంత విరామం తీసుకున్న మహేష్, రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆయన ఫస్ట్ పాన్ ఇండియా / వరల్డ్ సినిమా ఇది.


Also Read: తమిళంలోకి ప్రేమలు - మలయాళం, తెలుగు టైపులో సక్సెస్ అవుతుందా?