Malayalam blockbuster Premalu Tamil version gets release date: లేటెస్ట్ యూత్ సెన్సేషనల్ ఫిల్మ్ 'ప్రేమలు'. ఇదొక మలయాళ సినిమా. హైదరాబాద్ సిటీ నేపథ్యంలో తీశారు. కేరళలో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లోనూ మలయాళ వెర్షన్ బాగా చూశారు. మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయ్యాక 'ప్రేమలు'ను తెలుగులో అనువదించారు. ఏపీ, తెలంగాణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఆదరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా భారీ విజయం సాధించింది. దాంతో ఇప్పుడు తమిళంలో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ శుక్రవారం తమిళంలో సినిమా విడుదల అవుతోంది.
తమిళనాడులో మార్చి 15న 'ప్రేమలు' విడుదల
Premalu Tamil version release on March 15th: మార్చి 15... అంటే ఈ శుక్రవారం 'ప్రేమలు' చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్నారు. కేరళ, తెలంగాణ & ఏపీ తరహాలో తమిళనాడులో కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.
Also Read: ప్రభాసే నంబర్ వన్ - ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌లో ఏకైక హీరోగా రెబల్ స్టార్!
తెలుగు సినిమాల కంటే 'ప్రేమలు'కు ఎక్కువ క్రేజ్!
Premalu Movie Telugu Release: తెలుగులో 'ప్రేమలు'ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ విడుదల చేశారు. మహేష్ బాబు సైతం ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. మరోవైపు థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ సైతం బావుంది.
'ప్రేమలు'తో పాటు మార్చి 8న తెలుగు సినిమాలు గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' విడుదల అయ్యాయి. ఆ రెండు సినిమాల కంటే మలయాళ డబ్బింగ్ సినిమాకు బుక్ మై షో, పేటీఎం వంటి సైట్లలో ఎక్కువ టికెట్స్ సేల్ అవుతుండటం గమనార్హం.
Also Read: జగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!
'ప్రేమలు' సినిమాలో నస్లీన్ కె గఫూర్, మమతా బైజు జంటగా నటించారు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. మలయాళంలో భావన స్టూడియోస్ సంస్థతో కలిసి ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతతన్, శ్యామ్ పుష్కరణ్ వంటి వారు నిర్మాణంలో భాగం అయ్యారు. అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్.ఎం., అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
కిరణ్ జోసేతో కలిసి గిరీష్ ఏడీ స్క్రీన్ ప్లే అందించగా... విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చారు. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ, ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తెలుగులో 'నైన్‌టీస్' (90s) ఫేమ్ ఆదిత్య హాసన్ సంబాషణలు రాశారు.