భారతీయ సినిమాకు బాహుబలి ప్రభాస్. అభిమానులు ముద్దుగా రెబల్ స్టార్ అని, డార్లింగ్ అని పిలుస్తారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే... ఒదిగి ఉండటం ఆయన నైజం. ఇండియన్ బాక్సాఫీస్ బరిలో వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన తొలి సినిమా ఆయన పేరు మీద ఉంది. ఓపెనింగ్స్ విషయంలో మొదటి రోజు వంద కోట్లు ఈజీగా దాటేస్తున్న హీరో ప్రభాస్ అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతిసారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఆయనకు మాత్రమే చెల్లుతోంది. లేటెస్టుగా సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో ఆయన కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.
ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌లో ఏకైక హీరో ప్రభాస్
Top Hashtags on X in India, Rebel Star Prabhas stands number one: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తెలుగు చలన చిత్రసీమను దాటి ఎప్పుడో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా మరోసారి అది నిజమే అని నిరూపితం అయ్యింది. ఎక్స్ (ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ రెబల్ స్టార్ క్రేజ్ కనిపించింది.
జనవరి 1, 2023 నుంచి జనవరి 1, 2024 మధ్య కాలంలో... ఏడాది పాటు మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్ టాగ్స్‌ను ఎక్స్ (ట్విట్టర్) విడుదల చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే... టాప్ 10 లిస్టులో ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచారు.
ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ 7వ స్థానంలో ఉంది. ఆయన రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా 9వ స్థానంలో ఉంది. ప్రభాస్ స్టార్ డమ్ (Prabhas Stardom)కు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Also Read: జగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!
ప్రభాస్ లిస్టులో భారీ సినిమాలు...
రిలీజుల కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు
'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తమది పాన్ వరల్డ్ సినిమా అని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ సినిమా 'కల్కి 2989 ఏడీ' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా విడుదల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
'కల్కి 2989 ఏడీ' తర్వాత హారర్ ఎంటర్‌టైనర్ 'రాజా సాబ్'తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ రెండూ కాకుండా మరికొన్ని సినిమాలు సైతం లైనులో ఉన్నాయి.
Also Read: యాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?