ఇప్పుడు సినిమాకు హద్దులు, సరిహద్దులు లేవు. భాషా భేదాలు అసలే లేవు. ఓ భాషలో పేరు వచ్చిన నటుడిని మరో భాషలోకి తీసుకు వెళుతున్నారు దర్శక నిర్మాతలు. ఆ జాబితాలో జగపతిబాబు (Jagapathi Babu) ఉన్నారు. ఆయన 10 సంవత్సరాల క్రితం తమిళ, కన్నడ సినిమాలు చేశారు. గత ఏడాది హిందీకి పరిచయం అయ్యారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లో విలన్ రోల్ చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ సినిమా 'రుస్లాన్'లో కీలక పాత్ర చేశారు. ఈ సినిమాతో ఫ్లాప్ లెక్క సెటిల్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే?
సల్మాన్ మూవీ ఫ్లాప్... మరి, 'రుస్లాన్'?
'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' కంటే ముందు 'రాధే శ్యామ్'లోనూ జగపతి బాబు యాక్ట్ చేశారు. అది హిందీలోనూ విడుదల అయ్యింది. అయితే, ఆ సినిమా హీరోతో పాటు దర్శక నిర్మాతలు తెలుగు వారు కనుక హిందీ మూవీగా పరిగణలోకి తీసుకోలేం. ఆ మూవీతో పాటు 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సైతం ఫ్లాప్. దాంతో జగపతి బాబుకు హిందీ ఎంట్రీలో హిట్ లేదు. ఇప్పుడు ఆయుష్ శర్మ 'రుస్లాన్'తో హిట్ అందుకుని లెక్క సెటిల్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది.
Also Read: యాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?
'రుస్లాన్' సినిమాలో పోలీస్ రోల్ చేసిన జగపతి!
Jagapathi Babu role in Ruslaan movie: 'రుస్లాన్' టీజర్ చూస్తే... జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారని తెలుస్తోంది. యూనిఫామ్ వేసుకున్న విజువల్స్ చూపించారు. హీరో ఆయుష్ శర్మతో పార్టీ చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. మరి, ఆయన రోల్ ఎలా ఉంటుందో?
Also Read: ప్రియదర్శి ఈర్ష్య పడేలా చైతన్య రావ్ - చిరంజీవి పేరు పెట్టుకోవడంతో హీరోలో భయం, భక్తి!
'రుస్లాన్' సినిమాను ప్రొడ్యూస్ చేసింది శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధా మోహన్. ఇటీవల విడుదలైన గోపీచంద్ 'భీమా'తో పాటు అంతకు ముందు 'పంతం', మాస్ మహారాజా 'బెంగాల్ టైగర్', 'ఓదెల రైల్వే స్టేషన్', 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 'రుస్లాన్' సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు.