ఆల్కహాల్ వ్యసనంలా మారిపోయింది. రోజూ తాగకపోతే ఉండలేని వాళ్లు ఎంతోమంది. అయితే ఇలా రోజూ తాగేవాళ్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కాలేయం దెబ్బతినే అవకాశాలు అధికమని చెబుతున్నారు వైద్యులు. దీన్ని ‘ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ (ఏఆర్ఎల్డి)’ అంటారు. ఇది మూడు రకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాలీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ హెపటైటిస్, ఆల్కహాలిక్ సిర్రోసిస్ వంటి తీవ్ర సమస్యలు కలగవచ్చు. కొన్ని ముందుస్తు లక్షణాల ద్వారా కాలేయం లివర్ డామెజ్ మొదలైందేమో తెలుసుకోవచ్చు.
అలసట
బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేవరకు ఇలానే ఉంటుంది. కాలేయం డామేజ్ అయిన వారికి కచ్చితంగా కలిగే లక్షణం ఇది. కొన్ని రకాల వైరస్ ల వల్ల, వారసత్వంగా వచ్చే వ్యాధుల వల్ల కూడా ఇలా కాలేయ వ్యాధులు వస్తాయి. అధికంగా ఆల్కహాల్ తాగే వారిలో కూడా లివర్ వ్యాధులు మొదలవుతాయి. తీవ్రంగా బలహీనంగా అనిపించినప్పుడు ఓసారి చెక్ చేయించుకోవడం మంచిది.
ఆకలి లేకపోవడం
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం అలవాటైన వారిలో కొన్నాళ్లకు ఆకలి అణిగిపోతుంది. ఆకలి వేయడం అనే ఫీలింగ్ కలుగదు. శరీరానికి సరిపడా పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అందంగా కాలేయం కూడా కణాలను నష్టపోతుంది.
వికారం
తరచూ వికారంగా అనిపిస్తుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే వ్యాధి కాలేయానికి సోకితే ఇలా వికారంగా, వాంతి వచ్చే ఫీలింగ్ కలుగుతుంది. పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. జ్వరంగా, ఒంట్లో బాగోలేని అనుభూతి కలుగుతుంది.
బరువు తగ్గడం
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి వేగంగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది. దీన్ని కూడా కాలేయం దెబ్బతినడానికి సంకేతంగా భావించవచ్చు. ఊబకాయులు ఈ రకంగా బరువు తగ్గడాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ, నిజానికి ఇది చాలా తీవ్రమైన మార్పు, ప్రమాదకరమైనది కూడా.
కాలేయం వాపు
ఏళ్ల కొద్దీ ఆల్కహాల్ తాగే వాళ్లలో కాలేయం వాపు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏఆర్ఎల్డీ (ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్)కి సంబంధించి ఇది సాధారణ లక్షణం. శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. చివరికి ఇది ప్రమాదకరమైన సిర్రోసిస్ దశకు దారి తీస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా
Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి