కొందరు ఒక్క పూట అన్నం దొరక్క అల్లాడుతుంటే.. ఇంకొందరు మాత్రం జల్సాలు చేస్తూ.. సంపదను వృథా చేస్తారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఓ మహిళ తన కుక్క పుట్టిన రోజు ఏర్పాట్ల కోసం ఏకంగా రూ.11 లక్షలు ఖర్చు చేసింది. సుమారు 520 డ్రోన్లను ఉపయోగించి లైట్ షో నిర్వహించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 


సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన పెంపుడు కుక్క 10వ పుట్టిన రోజు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసింది. చాంగ్షాలోని క్సియాంగ్జియాంగ్(Xiangjiang) నదీ తీరంలోని డ్రోన్ల సాయంతో లైట్ షో నిర్వహించింది. మొత్తం పుట్టిన రోజు కోసం సుమారు 11 లక్షలు వరకు వెచ్చించింది. 


Also Read: ‘అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి నన్ను రక్షించండి’.. వార్నీ, ఏకంగా హోర్డింగే పెట్టేశాడే!


డ్రోన్ల ద్వారా ‘హ్యాపీ బర్త్ డే డౌడు’, ‘కేక్’ తదితరాలు ప్యాటరన్‌లు ప్రదర్శించింది. అయితే.. ఈ ప్రదర్శనకు ఆమె అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదు. పైగా ఆమె వాటిని ‘నో-ఫ్లై’ జోన్‌లో ఎగరేసింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ డ్రోన్ల ప్రదర్శన నిలిపేశారు. ఈ సమాచారం వైరల్ కావడంతో ప్రజలు ఆమెను తిట్టిపోస్తున్నారు. కుక్క మీద ప్రేమ ఉండవచ్చు. కానీ, ఇలా ఖర్చు పెట్టడం వల్ల లాభం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇంత గ్రాండ్‌గా పుట్టిన రోజు చేస్తున్నట్లు ఆ కుక్క కూడా అర్థం చేసుకోలేదు.. అలాంటిది డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావ్ అని ప్రశ్నించారు. దాని పుట్టిన రోజు పేరుతో ఆ డబ్బును పేదల అవసరాలకు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు.



గత అక్టోబర్ నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్‌జౌ హైటెక్ జోన్‌లోని వాండా ప్లాజా షాపింగ్ మాల్‌ సమీపంలో 200 కంటే అధిక డ్రోన్‌లు ఆకాశంలో ఎగిరాయి. లైట్ షో ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, చాలా డ్రోన్‌లు అకస్మాత్తుగా నేలకొరిగాయి. దీంతో పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. 


Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...


Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి